F3 Movie: డబ్బు విషయంలో వెంకటేష్ ఫిలాసపీ అదుర్స్.. ఏమన్నారంటే..
F3 Movie: 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు విక్టరీ వెంకటేష్. టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు వెంకీ. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 36 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ..
F3 Movie: 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు విక్టరీ వెంకటేష్. టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు వెంకీ. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 36 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ మొదటి సినిమా చేస్తున్న హీరోలాగే నటిస్తుంటారు. అందుకే ఈ తరం సినీ లవర్స్ కూడా వెంకీ సినిమాలకు ఇట్టే కనెక్ట్ అవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. మారుతోన్న కాలానికి అనుగుణంగా తాను మారుతూ కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ మూవీస్‌లో నటిస్తూ మెప్పిస్తున్నారు.
ఇలా వచ్చిన చిత్రాల్లో ఎఫ్2 ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్, వెంకీలు హీరోలుగా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా ‘ఎఫ్3’ మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన వెంకీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఎఫ్3 సినిమా డబ్బు చుట్టూ తిరిగే కథంశంతో తెరకెక్కిన నేపథ్యంలో డబ్బు గురించి ఆయన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘త్వరగా డబ్బులు సంపాదించడం, పెద్ద కలలు కనడం మానవుని సహజ లక్షణం. ఈ ఆశ అందరికీ ఉంటుంది. ఈ క్రమంలో బోలెడు సమస్యలు ఎదురవుతాయి. బోలెడు పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలతో మారుతాం. ఒకవేళ మారకపోతే.. మళ్లీ అవే సమస్యల చుట్టూ తిరగాల్సి ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక జీవితంలో తాను డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత గురించి చెబుతూ..’అందరికీ డబ్బు కావాలి. దానికి కోసం అందరూ సరైన మార్గంలో కష్టపడాలి. ఈ నేచర్ మనకు కావాల్సింది ఇస్తుంది. లేనిదాని కోసం ఎక్కువ తాపత్రయపడకూడదు. ఉన్నదాన్ని సక్రమంగా వాడుకోవాలి. ఆనందంగా బతకాలి’ అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు వెంకీ. వెంకటేష్ చెప్పిన డబ్బు ఫిలాసపీ నిజంగానే సూపర్ కదూ!
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..