Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వరంలో నేడు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలు..
Jobs: నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. Novisync ఐటీ కంపెనీలో పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?
AP Jobs: పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్ మేళాలను నిర్వహిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న ఈ కార్పొరేషన్ తాజాగా విశాఖపట్నంలో జాబ్ మేళాను నిర్వహిస్తోంది.
నేడు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. Novisync ఐటీ కంపెనీలో పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎలా హాజరు కావాలి లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో సాఫ్ట్ వేర్ ట్రైనీ (25), US IT Business ఎగ్జిగ్యూటివ్ (20), ఐటీ రిక్రూటర్ (20) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ/పీజీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే అంతకు ముందు www.apssdc.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
* ఆదివారం ఉదయం 10 గంటల నుంచి D.No.10-48/9, Sunrise Enclave, Opp. To Sachiwalayam, Sairam Colony, Kommadhi, Visakhapatnam-530048 అడ్రస్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.
* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వెంట విద్యార్హతల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ తీసుకురావాలి.
* ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.1.8 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు జీతం అందిస్తారు. మధురవాడ, వైజాగ్‌లో పని చేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం 7989330319 నెంబర్‌ను సంప్రదించాలి.
* పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాయి. శని, ఆదివారాలు సెలవు. రొటేషనల్ షిఫ్ట్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్..
@AP_Skill has Conducting Pool Campus Drive for #Novisync at Sunrise Enclave @vizaggoap Register at: https://t.co/Sflqq72a6b pic.twitter.com/v9G3a6j2qH
— AP Skill Development (@AP_Skill) May 25, 2022
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..