Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Polycet Exam 2022: నేడే ఏపీ పాలిసెట్‌-2022 ప్రవేశ పరీక్ష.. 10 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (మే 29) ఉదయం 11 గంటలకు ఏపీ పాలిసెట్‌ ( Andhra Pradesh Polytechnic Common Entrance Test) - 2022 పరీక్ష ప్రారంభంకానుంది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్నాట్లు పూర్తి చేసినట్లు..

AP Polycet Exam 2022: నేడే ఏపీ పాలిసెట్‌-2022 ప్రవేశ పరీక్ష.. 10 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి..
Ap Polycet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 29, 2022 | 7:15 AM

AP Polycet 2022 result date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు (మే 29) ఉదయం 11 గంటలకు ఏపీ పాలిసెట్‌ ( Andhra Pradesh Polytechnic Common Entrance Test) – 2022 పరీక్ష ప్రారంభంకానుంది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్నాట్లు పూర్తి చేసినట్లు ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ (AP SBTET) డాక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విలేకరులతో ఈ మేరకు తెలియజేశారు. పాలిసెట్‌-2022 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 404 పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 10 గంటల నుంచే అనుమతిస్తామని.. పరీక్ష ప్రారంభించిన తర్వాత ఎవరినీ అనుమతించేది లేదని కమిషన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రవేశ పరీక్ష ఫలితాలు 10 రోజుల్లో విడులవ్వనున్నాయి. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 29 విభాగాల్లో మొత్తం 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరచిన వారికి మాత్రమే సీట్లు లభిస్తాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
ఈ తేదీల్లో పుట్టిన వారికి సరిపోయే బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
హాఫ్ సెంచరీతో సుదర్శన్ కీలక ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ 197
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
మధుమేహం బాధితులు పింక్‌ జామకాయ తింటే ఏమౌతుందో తెలుసా..?
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే కాంగ్రెస్ బలంః సుర్జేవాలా