Memory Loss: భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే షాకింగ్ సీన్.. అంతా మర్చిపోయిన భర్త.. చివరకు..
ఐరిష్ కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి ఒకరోజు తన భార్యతో శృంగారం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన మొబైల్లో తేదీని చూసుకొని ముందు రోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు.
Irish Man Memory Loss: భార్యభర్తలిద్దరూ చాలా ఏళ్ల పాటు అన్యోన్యంగా గడిపారు.. ఈ క్రమంలో ఒక రోజున భర్త.. భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే అంతా మర్చిపోయాడు. అయితే.. షాక్‌కి గురైన కుటుంబసభ్యులు డాక్టర్ల దగ్గరకు పరుగులు తీశారు. ఈ ఆశ్చర్యకర ఘటన ఐర్లాండ్‌లో జరిగింది. విచిత్రమైన ఈ సంఘటనను సంబంధించిన వివరాలను ఐరిష్ జర్నల్ ప్రచురించింది. జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఐరిష్ కు చెందిన 66 ఏళ్ల వ్యక్తి ఒకరోజు తన భార్యతో శృంగారం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన మొబైల్లో తేదీని చూసుకొని ముందు రోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారంతా కంగారు పడ్డారు. వాస్తవానికి ఆ ముందు రోజు సాయంత్రం ఇంట్లో పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిగింది. కానీ ఇదంతా తనకు గుర్తు తెలియదంటూ వారికి చెప్పాడు. అయితే.. ఆ సంఘటనను భర్త ఎలా మరిచిపోయాడో భార్యకు అర్థం కాలేదు. దీంతో ముందు రోజు సాయంత్రం జరిగిన వేడుకలను పదే పదే చెప్పి గుర్తుకు తెచ్చేందుకు భార్యా పిల్లలు, కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
అయితే.. తన పేరు, వయసు, మరికొన్ని విషయాలను గుర్తుపెట్టుకున్న ఆ వ్యక్తి.. ఇవన్నీ మరిచిపోవడం ఏంటంటూ కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు.. ప్రమాదం ఏం లేదని.. ఇది స్వల్పకాలిక మతిమరుపుగా పేర్కొన్నారు. వైద్య పరిభాషలో దీనిని ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా (TGA) అంటారని వైద్యులు పేర్కొన్నారు. ఇది 50 నుంచి 70 ఏళ్ల మధ్య వారిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
2015 లో కూడా ఈ వ్యక్తి టీజీఏ ప్రభావానికి లోనయ్యాడని జర్నల్‌లో వివరించారు. ఆ సమయంలోనూ భార్యతో శృంగారం చేసిన తర్వాతే మతిమరుపునకు గురయ్యడని దీనిలో పేర్కొన్నారు.