Pakistan Drone: భారత సరిహద్దుల్లో పాక్‌ పిచ్చిపనులు.. ధీటుగా జవాబిచ్చిన సైన్యం..

తల్లి హరియా చక్ ప్రాంతంలోని సరిహద్దులో ఉదయం డ్రోన్ కదలికను గుర్తించిన పోలీసుల సెర్చ్ పార్టీ.. దానిపై కాల్పులు జరిపి నేలకూల్చింది.

Pakistan Drone: భారత సరిహద్దుల్లో పాక్‌ పిచ్చిపనులు.. ధీటుగా జవాబిచ్చిన సైన్యం..
Pak Drone
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2022 | 12:44 PM

Pakistan Drone Shot Down In JK: భారత సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థానీ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చివేశాయి. ఈ ఘటన జమ్మూకశ్మీర్ లోని హరియా చక్ ప్రాంతంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో.. డ్రోన్ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది. రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తల్లి హరియా చక్ ప్రాంతంలోని సరిహద్దులో ఉదయం డ్రోన్ కదలికను గుర్తించిన పోలీసుల సెర్చ్ పార్టీ.. దానిపై కాల్పులు జరిపి నేలకూల్చింది. అయితే.. డ్రోన్‌కు పేలుడు పదార్థాలను గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన స్క్వాడ్ డ్రోన్ బాంబును నిర్వీర్యం చేసింది. కాగా.. సరిహద్దు వెంబడి తరచుగా డ్రోన్ కార్యకలాపాలను తనిఖీ చేయడానికి సెర్చ్ పార్టీని ఆ ప్రాంతానికి పంపినట్లు జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. కొన్ని రోజుల నుంచి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్‌ డ్రోన్లు అలజడి రేపుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇదిలాఉంటే.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజుల్లోనే 8 మందికి పైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశిస్తుండటంతో.. అధికారులు భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..