Fake Currency Note: దేశంలో రూ.500, రూ.2000 నకిలీ నోట్లు ఎంత పెరిగాయో తెలుసా..? RBI తాజా నివేదిక..!

Fake Currency Note: భారతదేశంలో నకిలీ కరెన్సీ నోట్ల ట్రెండ్ పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం.. దేశంలో రూ.500 నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపు కాగా, రూ.2000..

Fake Currency Note: దేశంలో రూ.500, రూ.2000 నకిలీ నోట్లు ఎంత పెరిగాయో తెలుసా..? RBI తాజా నివేదిక..!
Follow us
Subhash Goud

|

Updated on: May 29, 2022 | 12:33 PM

Fake Currency Note: భారతదేశంలో నకిలీ కరెన్సీ నోట్ల ట్రెండ్ పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం.. దేశంలో రూ.500 నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపు కాగా, రూ.2000 నకిలీ నోట్ల సంఖ్య కూడా 50 శాతానికి పైగా పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. నకిలీ నోట్లను అరికట్టేందుకు సెంట్రల్ బ్యాంక్ ఎప్పటికప్పుడు అసలైన నోట్ల గుర్తింపునకు సంబంధించిన హెచ్చరికలను జారీ చేస్తూనే ఉంటుంది. ET Now నివేదిక ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నకిలీ నోట్ల సంఖ్య ఊహించని విధంగా పెరిగింది. సెంట్రల్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. 500 రూపాయల నకిలీ నోట్లలో 101.9 శాతం పెరుగుదల ఉంది. అలాగే 2000 రూపాయల నకిలీ నోట్లలో 54.16 శాతం పెరిగింది. 31 మార్చి 2021 నాటికి రూ. 2000, రూ. 500 నోట్ల వాటా మొత్తం చెలామణిలో ఉన్న నోట్ల విలువలో 85.7 శాతంగా ఉంది. ఒక సంవత్సరం తర్వాత అంటే 2022 మార్చి 31 నాటికి అది 87.1 శాతానికి పెరిగింది.

మార్చి 31, 2022 నాటికి రూ. 500 డినామినేషన్ బ్యాంక్ నోట్లు అత్యధిక వాటా (34.9 శాతం) కలిగి ఉన్నాయి. ఆ తర్వాత రూ.10 డినామినేషన్ నోట్లు, మొత్తం నోట్లలో 21.3 శాతం ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే రూ.10, 20, 200, 500 (కొత్త డిజైన్), రూ.2000 నకిలీ నోట్లు వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరిగాయి. అదే సమయంలో 50 రూపాయల నకిలీ నోట్లు 28.7 శాతం తగ్గగా, 100 రూపాయల నకిలీ నోట్లు 16.7 శాతం తగ్గినట్లు ఆర్బీఐ నివేదికలు చెబుతున్నాయి.

తగ్గుముఖం పట్టిన 2000 రూపాయల నోట్ల సంఖ్య:

ఇవి కూడా చదవండి

గత కొన్నేళ్లుగా 2000 రూపాయల నోట్ల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, ఈసారి కూడా అదే కొనసాగుతోంది. మార్చి 2022 వరకు మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్ల వాటా మొత్తం 1.6 శాతం. అంటే 214 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది మార్చి వరకు అన్ని డినామినేషన్ల నోట్ల సంఖ్య 13,053 కోట్లు కాగా, గతేడాది అంటే 2021లో ఈ సంఖ్య 12,437 కోట్లు. ఇలా నకిలీ నోట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్బీఐతో పాటు పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి