AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert for Farmers‌: రైతులకు అలర్ట్‌.. ఇంకా రెండే రోజులు.. ఈ పని పూర్తి చేయకపోతే డబ్బులు రావు..!

Alert for Farmers‌: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ సాయం పొందాలంటే..

Alert for Farmers‌: రైతులకు అలర్ట్‌.. ఇంకా రెండే రోజులు.. ఈ పని పూర్తి చేయకపోతే డబ్బులు రావు..!
Subhash Goud
|

Updated on: May 29, 2022 | 9:17 AM

Share

Alert for Farmers‌: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ సాయం పొందాలంటే రైతులు తమ కేవైసీని పూర్తి చేసుకుని ఉండాలి. లేకపోతే ఆర్థిక సాయం అందదు. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి (PM Kisan Samman Nidhi) కింద అర్హులైన రైతులు ఈ-కేవైసీని సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకులు కూడా e-KYC చేసుకోవాలని పదేపదే చెబుతూ వస్తోంది. ఈ పని చేసుకోకుంటే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే ఇది వరకు ఈ-కేవైసీ గడువు మార్చి 31, 2022 వరకు ఉండగా, దానిని మే 31,2022 వరకు పొడిగించింది. ఈ నెల చివరితో గడువు ముగియనుంది. ఈలోగా కేవైసీ పూర్తి చేసుకోలేని వారు ఉంటే వెంటనే పూర్తి చేసుకోవడం మంచిది.

ప్రధాన మంత్రి కిసాన్‌ నమోదిత రైతులు ఈ-కేవైసీని తప్పనిసరిగ్గా చేసుకోవాలని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి వెబ్‌సైట్‌లో కేంద్రం తెలిపింది. ఈ మేరకు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ కు వెళ్లి తెలుసుకోవచ్చని వెల్లడించింది. అయితే ఆధార్‌ ఓటీపీతో ఈ పని చేయలేరు. ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలంటే రైతులు తమ ఆధార్‌ కార్డును తీసుకుని సీఎస్‌సీ (కామన్‌ సర్వీసు సెంటర్‌)లకు వెళ్లాలని సూచించింది. కాగా, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింది విడుదలను పొందాలంటే రైతులు ఈ-కేవైసీ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.6వేల చొప్పున జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు వాయిదాలలో రూ.2వేల చొప్పున అందిస్తోంది. పీఎం-కిసాన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ) స్కీమ్. అంటే నేరుగా అర్హులైన రైతుల అకౌంట్లోకే ఏడాదికి రూ.6 వేల చొప్పున నిధులను ప్రభుత్వం అందిస్తోంది.

ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోండిలా..

ఇవి కూడా చదవండి

☛ పీఎం కిసాన్ అధికారిక వెబ్‌పేజీ  సందర్శించాలి.

☛ ఈ పేజీలో కుడి వైపున్న ఈ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

☛ ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా కోడ్‌‌ను నమోదు చేసి, సెర్చ్ నొక్కాలి.

☛ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

☛ గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని నమోదు చేస్తే సరిపోతుంది. మీ ఈకేవైసీ పూర్తయినట్లే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
రెండోసారి ప్రెగ్నెన్సీ.. బేబీ బంప్ తో టాలీవుడ్ నటి పూర్ణ.. ఫొటోస్
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే