AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amul Organic Atta: ఆర్గానిక్ కిరాణా ఉత్పత్తుల వ్యాపారంలోకి అమూల్ ఎంట్రీ.. మెుదటగా మార్కెట్లోకి..

Amul Organic Atta: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) దేశవిదేశాల్లో అమూల్ బ్రాండ్ పేరుతో తన పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమూల్ ఆసియాలోని సూపర్ బ్రాండ్స్ లో ఒకటిగా ఉంది.

Amul Organic Atta: ఆర్గానిక్ కిరాణా ఉత్పత్తుల వ్యాపారంలోకి అమూల్ ఎంట్రీ.. మెుదటగా మార్కెట్లోకి..
Amul
Ayyappa Mamidi
| Edited By: |

Updated on: May 29, 2022 | 2:46 PM

Share

Amul Organic Atta: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) దేశవిదేశాల్లో అమూల్ బ్రాండ్ పేరుతో తన పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమూల్ ఆసియాలోని సూపర్ బ్రాండ్స్ లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం కంపెనీ అమూల్ బ్రాండ్ పేరుతో ఆర్గానిక్ గోధుమ పిండిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అమూల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది. హోమ్ మంత్రి అమిత్ షా సలహా మేరకు, కంపెనీ అమూల్ ఆర్గానిక్ గోధుమ పిండిని అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ భవిష్యత్తులో పెసరపప్పు, కందిపప్పు, పశ్చనగప్పు, బాస్మతి బియ్యం వంటి ఉత్పత్తులను కూడా విడుదల చేయనుంది. ఈ వ్యాపారం కింద ప్రారంభించిన మొదటి ఉత్పత్తి ‘అమూల్ ఆర్గానిక్ హోల్ వీట్ ఆటా ‘ అని GCMMF తెలిపింది.

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను ఏకతాటిపైకి తీసుకువస్తామని.. పాల సేకరణ తరహాలోని పద్ధతులను ఈ వ్యాపారంలో కూడా అవలంబిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధి తెలిపారు. ఇది సేంద్రీయ రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు సేంద్రీయ ఆహార పరిశ్రమను ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని అన్నారు. రైతులను మార్కెట్‌కు అనుసంధానం చేయడం పెద్ద సవాలుగా ఉన్నప్పటికీ.. సేంద్రీయ పరీక్ష సౌకర్యాలు కూడా ఖరీదైనవిగా ఉన్నాయని అమూల్ తెలిపింది. అందువల్ల.. సేంద్రీయ వ్యవసాయంతో రైతులను మార్కెట్‌కు అనుసంధానం చేయడమే కాకుండా.. అమూల్ దేశవ్యాప్తంగా ఐదు ప్రదేశాల్లో ఆర్గానిక్ టెస్టింగ్ లేబొరేటరీలను కూడా ఏర్పాటు చేయనుంది. అహ్మదాబాద్‌లోని అమూల్ ఫెడ్ డెయిరీలో తొలిసారిగా ఇలాంటి ల్యాబొరేటరీని రైతుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు.

జూన్ మొదటి వారం నుంచి గుజరాత్‌లోని అన్ని అమూల్ పార్లర్‌లు, రిటైల్ అవుట్‌లెట్లలో ఆర్గానికి గోధుమ పిండి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. జూన్ నుంచి గుజరాత్, ఢిల్లీ-NCR, ముంబై, పూణేలలో నివసించేవారు ఆన్‌లైన్ ఆర్డర్ చేయవచ్చని తెలిపింది. కిలో పిండి ధర రూ.60, ఐదు కిలోల పిండి ధర రూ.290గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.