Visa Free Countries for Indians: భారతీయులు వీసా లేకుండా ఏయే దేశాలకు వెళ్లవచ్చు.. ఆ దేశాలేంటో తెలుసుకోండి..!
Visa Free Countries for Indians: భారతీయులు ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తప్పనిసరి. ఇది లేనిది వెళ్లేందుకు కుదరదు. విదేశాలకు వెళ్లడానికి యువతతో పాటు అన్ని..
Visa Free Countries for Indians: భారతీయులు ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తప్పనిసరి. ఇది లేనిది వెళ్లేందుకు కుదరదు. విదేశాలకు వెళ్లడానికి యువతతో పాటు అన్ని వయసుల వారు ఇష్టపడుతుంటారు. విదేశీ పర్యటనలకు వెళ్లాలనే అభిరుచి ఉంటుంది. కొత్త ప్రదేశానికి ముఖ్యంగా విదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడని వారు ఉండరు. దీనికి పాస్‌పోర్ట్ అవసరమని అందరికీ తెలిసిందే. పాస్‌పోర్ట్‌తో పాటు వీసా కూడా అవసరం. కానీ చాలా సార్లు వీసా కోసం దరఖాస్తు చేసిన తర్వాత మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు కాస్త సమయం పడుతుంటుంది. వీసా విషయంలో ఏ చిన్న పొరపాటు ఉన్నా రద్దు అవుతుంది. అప్పుడు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
అయితే వీసా లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లాలనే మీ కల నెరవేరదని కాదు. మీరు వీసా లేకుండా ప్రయాణించగల అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో వీసా లేకుండా పర్యటించి దేశాలు దాదాఆపు 60 ఉన్నాయి. ఈ దేశాల్లో మీరు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అని చెప్పవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అంటే మీరు ఇతర దేశాలకు వెళ్లడానికి వీసా పొందాల్సిన అవసరం లేదని అర్థం. అయితే చాలా దేశాల్లో వీసా ఆన్ అరైవల్ అందుబాటులో ఉంటుంది. 59 వీసా రహిత దేశాల పేర్లను తెలుసుకుందాం.
ఈ జాబితాలో ఉన్న దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా పర్యటించవచ్చు. మాల్దీవులు, మారిషస్, ఫిజీ, శ్రీలంక, బొలీవియా, నేపాల్, థాయిలాండ్, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావో, మయన్మార్, ఇరాన్, జోర్డాన్, ఖతార్, ఒమన్, టాంజానియా, టోగో, సెనెగల్, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్, టొబాగో, జమైకా, మోంట్సెరాట్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, మైక్రోనేషియా, సెర్రా లియోన్, మార్షల్ దీవులు, పలావు దీవులు, సమోవా, తువాలు, వనాటు, అల్బేనియా, సెర్బియా, బార్బడోస్, బ్రిటీష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతీ, ట్యునీషియా, కుక్ దీవులు, తైమూర్-లెస్టే, ఎల్ సాల్వడార్, బోట్స్‌వానా, కేప్ వెర్డే దీవులు, కొమోరెస్ దీవులు, ఇథియోపియా, గాబన్, మడగాస్కర్, మౌరిటానియా, మొజాంబిక్, నియు, రువాండా, సీషెల్స్, సోమాలియా, ఉగాండా, జింబాబ్వే దేశాలు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి