Telugu News » Photo gallery » Why ostriches bury their head in the sand know the science behind it
Ostriches: ఉష్ణ పక్షి ఇసుకలో ఎందుకు తల దాచుకుంటుంది..? దీని వెనుక అసలు కారణం ఇదే..!
Ostriches: మీరు ఉష్ణ పక్షి చిత్రాల సోషల్ మీడియాలో,గూగుల్‌లో చూసి ఉంటారు. ఈ పక్షి గురించి గూగుల్‌ల వెతికినప్పుడు అత్యంత సాధారణ ఫోటో ఒకటి కనిపిస్తుంటుంది. ఈ పక్షి ఇసుకలో తలను..
Ostriches: మీరు ఉష్ణ పక్షి చిత్రాల సోషల్ మీడియాలో,గూగుల్‌లో చూసి ఉంటారు. ఈ పక్షి గురించి గూగుల్‌ల వెతికినప్పుడు అత్యంత సాధారణ ఫోటో ఒకటి కనిపిస్తుంటుంది. ఈ పక్షి ఇసుకలో తలను పాతిపెట్టిట్టుగా ఉంటుంది. ఆపద వచ్చినప్పుడు ప్రమాదాన్ని చూడలేక ఇసుకలోనో, నేలలోనో తల దాచుకుంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఇందులో నిజం లేదు. సైన్స్ ప్రకారం చూస్తే.. ఆ ఉష్ణపక్షి ఇలా చేయడం వెనుక కారణాలున్నాయి. మరి ఉష్ణపక్షి అలా ఇసుకలో తలదాచుకుంటుందో తెలుసుకుందాం.
1 / 5
ScienceABC నివేదిక ప్రకారం.. ఉష్ణ పక్షి ఇలా చేయడానికి కారణం వాటి గుడ్లకు సంబంధించినది. ఆస్ట్రిచ్‌లు ఎగరలేవు కాబట్టి అవి చెట్టు మీద కాకుండా భూమిలో గొయ్యి తవ్వడం ద్వారా తమ గూళ్ళను తయారు చేస్తాయి. ఎందుకంటే వాటి గుడ్ల కొబ్బరికాయ పరిమాణంలో పెద్దగానే ఉంటాయి. గుడ్లు పెట్టడానికి అవి భూమిలో ఒక గొయ్యిని తయారు చేస్తారు.
2 / 5
ఉష్ణ పక్షి విషయంలో గుడ్లను పొదిగే బాధ్యత ఆడ పక్షికి మాత్రమే కాకుండా మగ పక్షికి కూడా ఉంటుంది. గుడ్ల నుండి పిల్లలు పొదుగడానికి వెచ్చదనం ఇవ్వాలి. అందుకే ఆస్ట్రిచ్‌లు ఇసుకలో గుంతలు వేసి వాటిని ఉంచుతాయి. ఈ గుంటలలో తలలు పెట్టి అవి గుడ్లను తిప్పుతూ ఉంటాయి. తద్వారా గుడ్లు అన్ని వైపుల నుండి వేడిని పొందుతాయి. దీంతో పిల్లలు వాటి నుండి బయటకు వస్తాయి.
3 / 5
ఉష్ణపక్షి గుడ్డు డజను కోడిగుడ్లతో సమానం. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత 42 నుండి 45 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. అవి బయటకు వచ్చే వరకు ఈ ఉష్ట్రపక్షి దాని తలను ఎక్కువ సార్లు నేలల్లో ఉంచుతుంది. ఆ గుడ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. గుడ్లు పొదిగేందుకు తగినంత వేడిగా ఉండేలా వాటిని తిప్పుతాయి. ఇలా చేయడం వల్ల భూమిలో తలదాచుకుంటున్నట్లు భావిస్తుంటారు.
4 / 5
కష్టాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు తల కింద పెట్టుకుంటే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుందని నివేదిక పేర్కొంది. అందుకే ఇది కేవలం భ్రమ మాత్రమే. దాని పిల్లలను సురక్షితంగా బయటకు వచ్చేందుకు అవి పెట్టిన గుడ్లను భూమిలో దాచుకునే ప్రయత్నమేనని జంతు పరిశోధకులు చెబుతున్నారు