- Telugu News Photo Gallery Cinema photos Actress sai pallavi won gold medal for her performance in shyam singha roy movie
Sai Pallavi: అరుదైన రికార్డ్ అందుకున్న సాయి పల్లవి.. ఆమె నటనకు మరో గోల్డ్ మెడల్..
సినీ పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి స్థానం ప్రత్యేకం.. గ్లామరస్ షోలకు దూరంగా ఉంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
Updated on: May 29, 2022 | 10:57 AM

సినీ పరిశ్రమలో హీరోయిన్ సాయి పల్లవి స్థానం ప్రత్యేకం.. గ్లామరస్ షోలకు దూరంగా ఉంటూ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.

మొదటి సినిమాతోనే తన నటనకు ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

టాలెంట్ ఉంటే అందంతో పని లేదని నిరూపించింది.. మేకప్ లేకుండానే సినిమాల్లో నటించి న్యాచురల్ బ్యూటీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పాత్రకు.. కథకు ప్రాధాన్యత ఉంటేనే నటించేందుకు ఒప్పుకుంటుంది.. స్టార్ హీరోలతో అవకాశం వచ్చినప్పటికీ పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మోహ్మటంగా తిరస్కరించింది.

చిన్నప్పటి నుంచి తమిళ్ స్టార్ హీరో సూర్య అంటే ఇష్టం.. అయనతో కలిసి ఒక్క సినిమా నటించాలనుకున్నాను.. ఎన్జీకే తో ఆ కోరిక నెరవేరింది.

ఇటీవల నాని సరసన శ్యామ్ సింగరాయ్ లో దేవదాసి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఆమె పాత్రకు ఆమెకు గోల్డ్ మెడల్ దక్కింది.

ఇలా గోల్డ్ మెడల్ రావడం సాయి పల్లవికి మొదటి సారి కాదు.. గతంలోనూ రెండి సాధించింది. 2017లో కాళి సినిమాకు మొదటి సారి గోల్డ్ మెడల్ అందుకోగా.. 2019లో మాలయాళంలో ఫహాద్ ఫాజిల్ నటించిన అథిరన్ సినిమాకు రెండో గోల్డ్ మెడల్ సాధించింది.




