Singh Maheshwar: ప్రతి ఏడాది పెరుగుతున్న శివలింగం సైజ్.. శివపార్వతులుగా పూజలందుకుంటున్న మహిమానిత్వ క్షేత్రం

ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) హమీర్‌పూర్‌లోని( Hamirpur) ఓ ఆలయం కూడా అనేక రహస్యాలకు నెలవు. ఇక్కడ శివలింగం పరిమాణం ప్రతి ఏడాదికీ పెరుగుతుంది. అంతే కాదు చందనం చెట్లు కూడా ఇక్కడ వాటంతట అవే పెరుగుతాయి.

Singh Maheshwar: ప్రతి ఏడాది పెరుగుతున్న శివలింగం సైజ్.. శివపార్వతులుగా పూజలందుకుంటున్న మహిమానిత్వ క్షేత్రం
Singh Maheshwari Temple Ham
Follow us
Surya Kala

|

Updated on: Jun 10, 2022 | 2:59 PM

Singh Maheshwar Temple: భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. మనదేశంలో అనేక అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లోని రహస్యాలు ఇప్పటికీ సైన్స్ సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఈ  రోజు మనం ఉత్తరప్రదేశ్‌లోని(Uttarpradesh) హమీర్‌పూర్‌లోని( Hamirpur) ఓ ఆలయం కూడా అనేక రహస్యాలకు నెలవు. ఇక్కడ శివలింగం పరిమాణం ప్రతి ఏడాదికీ పెరుగుతుంది. అంతే కాదు చందనం చెట్లు కూడా ఇక్కడ వాటంతట అవే పెరుగుతాయి. ఈ ఆలయాన్ని సింగ మహేశ్వర శివాలయం అని పిలుస్తారు. గురు నారాయణ్ దాస్ సుమారు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ గంధపు చెట్టును నాటారని ఆలయాల పూజారులు చెబుతున్నారు. అప్పటి నుండి.. శ్రీగంధం చెట్లను పెంచే ప్రక్రియ ఇక్కడ ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. నేడు, ఈ ఆలయ ప్రాంతంలో దాదాపు 6వందల చందనం చెట్లు పెరిగాయి. ఇక్కడ శివపార్వతులు ఈ చందనంతో అలంకరించబడి ఉంటారు. ఈ ఆలయ ఖ్యాతి చాలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. దీంతో ఇక్కడ కొలువైన శివపార్వతులను దర్శించుకోవడానికి, గంధపు చెట్లను చూడటానికి ఇక్కడికి వస్తారు.

ప్రతి సంవత్సరం శివలింగం పరిమాణం పెరుగుతుంది సింగ మహేశ్వర మహాదేవ్ ఆలయం హమీర్‌పూర్ జిల్లా హెడ్ క్వార్టర్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో యమునా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఉన్నాయి. ఒక లింగాన్ని శివుడిగా మరొక లింగాన్ని పార్వతి గా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పాటలీ శివలింగం అంటారు. చరిత్రకారుడు భవానీ దిన్ ప్రకారం..  ఈ ధామ్‌లో ఉన్న రెండు శివలింగాలు గుప్త శివలింగాలు.. ఇవి స్వయంగా భూమి నుండి బయల్పడ్డాయి. ఈ లింగాలు అమూల్యమైన రాతితో తయారు చేయబడ్డాయి. ఈ శివలింగాల పరిమాణం ప్రతి సంవత్సరం బియ్యం సైజ్లో పెరుగుతుంటాయి.

ప్రాచుర్యంలో ఉన్న ఆలయ కథ  సింగమహేశ్వర శివాలయం గురించి కూడా ఒక కథ ఉంది. ఈ కథ ప్రకారం..  ఇక్కడ యమునా నది వరద కారణంగా, కొంతమంది సాధువులు ఈ శివలింగాలను మరొక ప్రదేశంలో ప్రతిష్టించాలని భావించారు. ఇందుకోసం తవ్వకాలు కూడా ప్రారంభించారు. భూమిని ఎంత లోతుగా తవ్వినా.. శివలింగాల చివర కనిపించకపోవడంతో సాధువులు, గ్రామస్థులు చేతులెత్తేశారు. దీని తరువాత అదే స్థలంలో శివలింగాలకు పూజలను నిర్వహించడం ప్రారంభించారు. ఆలయాన్ని కొత్తగా పునర్నిర్మించారు. ఈ ఆలయంలో శివపార్వతులను భక్తితో పూజించి.. ఏదైనా అడిగితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

ఇవి కూడా చదవండి

గంధపు చెట్లు :  ఈ ఆలయం చుట్టూ దాదాపు 6 వందల చందనం చెట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ చెట్లు ఎప్పుడు, ఎలా పెరుగుతాయో కూడా ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ ఉన్న శ్రీచందనం చెట్లు చాలా విలువైనవని.. గత  25 ఏళ్లలో దాదాపు 18 విలువైన శ్రీగంధం చెట్లు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. దొంగిలించబడిన ఈ చెట్లను నేటికీ తిరిగి పొందలేకపోయారు. ఈ ఆలయంలో పెరుగుతున్న గంధపు చెట్లన్నీశివుడి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయని ఇక్కడ పూజారుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..