Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపటి నుంచి జ్యేష్టాభిషేకం టికెట్ల బుకింగ్.. పూర్తి వివరాలివే..
TTD : తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి (జూన్ 11) నుంచి జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తిరుమలలో ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు
TTD : తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రేపటి (జూన్ 11) నుంచి జ్యేష్టాభిషేకం సేవా టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తిరుమలలో ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం మూడు రోజులపాటు జ్యేష్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ సేవకు సంబంధించిన టికెట్లు ఒకరోజు ముందు నుంచి అంటే జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుమలలో కరెంట్ బుకింగ్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. రోజుకు 600 టికెట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొంది.జ్యేష్టాభిషేకం టికెట్ ధర రూ. 400 రూపాయలుగా నిర్ణయించారు.
సీఆర్వో కార్యాలయానికి ఎదురుగా ఉన్న కౌంటర్‌లో భక్తుల ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ తీసుకుని జ్యేష్టాభిషేకం టికెట్లు జారీ చేయనున్నారు. సేవకు ఒక రోజు ముందుగా మొదట వచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదికన ఈ టికెట్లు మంజూరు చేస్తారు. ఒక చిన్న లడ్డూను ప్రసాదంగా అందజేయనున్నారు. సేవా టికెట్లు పొందిన భక్తులు ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలి. ఆలయంలోని సంపంగి ప్రాకారంలో గల కల్యాణోత్సవ మండపంలో జ్యేష్టాభిషేకం జరుగుతుంది. సేవ అనంతరం భక్తులను మహా లఘుదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: