ఇదేం ఆటరా అయ్యా.. కన్ఫ్యూజన్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉన్నారే.. ఇలా కూడా పరుగులిస్తారా?.. నెట్టింట్లో వైరల్ వీడియో..
European Cricket League: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరగుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి యూరోపియన్ క్రికెట్ లీగ్ (European Cricket League)లో చోటుచేసుకుంది.
European Cricket League: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరగుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి యూరోపియన్ క్రికెట్ లీగ్ (European Cricket League)లో చోటుచేసుకుంది. వికెట్ కీపర్ బంతిని సక్రమంగా అందుకున్న తర్వాత కూడా బ్యాటర్లు మూడు పరుగులు తీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వికెట్ కీపర్, బౌలర్లు, ఫీల్డర్ల మధ్య సమన్వయం కొరవడడమే దీనికి ప్రధాన కారణం. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ప్రేగ్ బార్బేరియన్, వినోహ్రడీ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే వర్షం అంతరాయం కలిగించడంతో 10 ఓవర్ల మ్యాచ్‌ను కాస్త ఐదు ఓవర్లకు కుదించారు. తొలుత ప్రేగ్ బార్బేరియన్స్ బ్యాటింగ్‌కు దిగింది. చివరి ఓవర్‌లో భారీగా పరగులు సాధించాలని ఆ జట్టు బ్యాటర్లు భావించాను. అయితే బౌలర్ వేసిన బంతిని ప్రేగ్ బ్యాటర్ మిస్ చేశాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి కీపర్ చేతిలో పడింది. అయితే బ్యాటర్ రన్‌కు ప్రయత్నించడంతో కీపర్ త్రో విసిరాడు. బంతి స్టంప్స్‌ను తాకడం మిస్ కావడంతో.. ఒక పరుగు వచ్చింది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కీపర్ వేసిన బంతిని అవతలి ఎండ్‌లో ఉన్న బౌలర్ అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో బ్యాటర్లు చకచకా మరో పరుగును పూర్తి చేశారు.
ఈసారి బౌలర్ మరోసారి బంతిని త్రో చేశాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే మూడో పరుగును కూడా పూర్తి చేశారు ప్రత్యర్థి బ్యాటర్లు. ఇలా పూర్తిగా గందరగోళం, సమన్వయ లోపంతో ప్రత్యర్థి జట్టుకు అనవసరంగా మూడు పరుగులు సమర్పించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ‘ఇదేం ఆటరా అయ్యా.. కన్ఫ్యూజన్‌కు కేరాఫ్ అడ్రస్‌లా ఉన్నారే.. మిమ్మల్ని చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి అందరినీ ఆకట్టుకుంటోన్న ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ట్రెండింగ్‌లో నయన్ వెడ్డింగ్ లుక్.. సౌతిండియన్ స్టైల్‌లో మెరిసిపోయిన లేడీ సూపర్‌స్టార్..