Ranji Trophy 2022: 93 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన ముంబై.. రంజీల్లో అరుదైన ఘనత.. బుల్లి సచిన్ సారథ్యంలోనే..

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్‌పై ఏకంగా 725 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాగా రంజీ ట్రోఫీలోనే కాదు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది అతిపెద్ద విజయం.

Ranji Trophy 2022: 93 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన ముంబై.. రంజీల్లో అరుదైన ఘనత.. బుల్లి సచిన్ సారథ్యంలోనే..
Ranji Trophy 2022
Follow us
Basha Shek

|

Updated on: Jun 09, 2022 | 5:47 PM

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్తరాఖండ్‌పై ఏకంగా 725 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. కాగా రంజీ ట్రోఫీలోనే కాదు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది అతిపెద్ద విజయం. ముంబై విధించిన 795 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఉత్తరాఖండ్‌కు జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. దీంతో 725 పరుగుల అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది ముంబై జట్టు. అంతకుముందు 1929-30 సంవత్సరంలో న్యూ సౌత్ వేల్స్ 685 పరుగుల తేడాతో క్వీన్స్‌లాండ్‌ను ఓడించింది. సుమారు 93 సంవత్సరాల తర్వాత ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది పృథ్వీషా సేన.

మ్యాచ్‌ ఆసాంతం ముంబైదే ఆదిపత్యం..

ఇవి కూడా చదవండి

ముంబై- ఉత్తరాఖండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. మ్యాచ్‌ ఆసాంతం ముంబైదే ఆదిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్లకు 647 పరుగుల భారీ స్కోరు సాధించింది. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సువీ పార్కర్ 252 పరుగులు చేసి ముంబై జట్టుకు భారీ స్కోరు అందించాడు. సర్ఫరాజ్ ఖాన్ 153 పరుగులు చేయగా.. అర్మాన్ జాఫర్ 60, షమ్స్ ములానీ కూడా 59 పరుగులతో తమ వంతు సహాయమందించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరాఖండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. కమల్ సింగ్ చేసిన 40 పరుగులు చేయడం మినహా ఏ ఆటగాడు క్రీజులో నిలబడలేకపోయాడు. కెప్టెన్ జై బిస్తా మొదటి బంతికే వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బ్యాటర్లు తన ప్రతాపం చూపారు. కెప్టెన్ పృథ్వీ షా 72, యశస్వి జైస్వాల్ 103 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ ఆదిత్య తారే 57 పరుగులతో రాణించడంతో ముంబై తన రెండో ఇన్నింగ్స్‌ను 261 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. ఉత్తరాఖండ్‌కు 795 పరుగుల టార్గెట్‌ను విధించింది. అయితే ఆ జట్టు ఏ మాత్రం ప్రతిఘటన లేకుండానే కేవలం 69 పరుగులకే చాపచుట్టేసింది.

పృథ్వీ షా కెప్టెన్సీలో..

కాగా కెప్టెన్సీ పరంగా మరోసారి ఆకట్టుకున్నాడు పృథ్వీ షా. 2018లో అతని కెప్టెన్సీలోనే టీమిండియా అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. దీని తర్వాత ముంబై గత ఏడాది అతని కెప్టెన్సీలో విజయ్ హజారే ట్రోఫీ 2021 గెలుచుకుంది. ఇప్పుడు పృథ్వీ షా కెప్టెన్సీలో ముంబై ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందుకోవడంతోపాటు రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

ట్రెండింగ్‌లో నయన్‌ వెడ్డింగ్‌ లుక్‌.. సౌతిండియన్‌ స్టైల్‌లో మెరిసిపోయిన లేడీ సూపర్‌స్టార్‌..

Virataparvam: విరాటపర్వం సినిమాపై యంగ్‌ హీరో రివ్యూ.. ఎపిక్‌ లవ్‌ స్టోరీ అంటూ..

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. గంటన్నర వ్యవధిలోనే దర్శనం.. ఎప్పటి నుంచంటే..