Basha Shek |
Updated on: Jun 09, 2022 | 4:48 PM
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు
కాగా తమ కూతురి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తల్లి రివాబా జడేజా పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 101 మంది నిరుపేద అమ్మాయిలు, వారి తల్లిదండ్రులతో కలిసి తమ గారాల పట్టి బర్త్ డే వేడుకలు నిర్వహించారు.
రవీంద్ర జడేజా ముద్దుల కూతురు నిధ్యనాబా ఐదో పుట్టిన రోజు సందర్భంగా సామాన్య ప్రజలతో కలిసి కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
తన కూతురు పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు జడేజా దంపతులు. ఇందులో భాగంగా రెవాబా జడేజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు
రివాబా, రవీంద్ర జడేజా ముద్దుల కూతురు నిధ్యానా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి
కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జామ్‌నగర్‌కు చెందిన101 మంది అమ్మాయిలకు సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచారు జడేజా దంపతులు. అదేవిధంగా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.10 వేలు డిపాజిట్ చేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు.
ఇలా దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన 10 వేల మంది అమ్మాయిలకు అండగా నిలవాలని జడేజా దంపతులు గతంలో నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే ఈ సారి 101 మంది అమ్మాయిల పేర్ల మీద సుకన్య సమృద్ధి బ్యాంకు ఖాతాలు తెరిచారట.