Virataparvam: విరాటపర్వం సినిమాపై యంగ్‌ హీరో రివ్యూ.. ఎపిక్‌ లవ్‌ స్టోరీ అంటూ..

Basha Shek

Basha Shek |

Updated on: Jun 09, 2022 | 3:42 PM

Hero Nikhil: దగ్గుబాటి రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన చిత్రం విరాటపర్వం (Virataparvam). నీది నాది ఒకే కథతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల (Venu Udugula) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Virataparvam: విరాటపర్వం సినిమాపై యంగ్‌ హీరో రివ్యూ.. ఎపిక్‌ లవ్‌ స్టోరీ అంటూ..
Virataparvam

Hero Nikhil: దగ్గుబాటి రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన చిత్రం విరాటపర్వం (Virataparvam). నీది నాది ఒకే కథతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల (Venu Udugula) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నక్సలిజానికి ప్రేమ కథను జోడించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా డి. సురేశ్‌ బాబు (D. Suresh BaBu) ఈ సినిమాను రూపొందించారు. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్స్‌ పనుల్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని, అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో రాణా, సాయిపల్లవి నోటి నుంచి వచ్చిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు ప్రముఖులు ఈ సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాను చూసేందుకు ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. తాజగా యంగ్‌ హీరో నిఖిల్‌ (Nikhil) విరాట పర్వం సినిమాపై స్పందించాడు. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

‘ఇప్పుడే విరాటపర్వం సినిమాను చూశాను. ఈ ఎపిక్ లవ్ స్టోరీ నన్ను షాక్‌కు గురిచేసింది. అంతేకాదు.. సినిమా చాలా అద్భుతంగా ఉంది. సాయి పల్లవి కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చింది. రానా దగ్గుబాటి నటన కూడా చాలా బాగుంది. ఈ సినిమాను అద్భుతంగా మలచిన దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత సుధాకర్ చెరుకూరికి హ్యాట్సాఫ్’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు నిఖిల్‌. కాగా ఇదివరకే బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌, దర్శకుడు కరణ్‌ జోహార్‌ కూడా విరాటపర్వం ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నివేతా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే 7.4 మిలియన్ల వ్యూస్‌ని దాటేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Special Trains: ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు శుభవార్త.. ఈ రూట్లలో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Basara RGUKT 2022: బాసర ఆర్జీయూకేటీ- 2022 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌.. త్వరలోనే..

ఇవి కూడా చదవండి

Nayanthara Vignesh Wedding: మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న పెళ్లి ఫోటోస్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu