Telugu News Sports News Cricket news Team India All Rounder Ravindra Jadeja and his wife come forward for noble cause, open 101 Sukanya Samridhi accounts on daughter's birthday
Ravindra Jadeja: పెద్ద మనసు చాటుకున్న జడేజా దంపతులు.. కూతురు పుట్టిన రోజును పురస్కరించుకుని ఏం చేశారంటే..
Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), అతని సతీమణి రివాబా జడేజా (Rivaba Jadeja) పెద్ద మనసు చాటుకున్నారు
Ravindra Jadeja: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), అతని సతీమణి రివాబా జడేజా (Rivaba Jadeja) పెద్ద మనసు చాటుకున్నారు. తమ గారాల పట్టి నిద్యానా ఐదో పుట్టిన రోజును పురస్కరించుకుని 101 మంది ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి బ్యాంకు ఖాతాలను తెరిపించారు. అదేవిధంగా ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 11వేలు డిపాజిట్ చేశారు. ఈ విషయాన్ని జడేజా దంపతులే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో వారి దాతృత్వంపై నెట్టింట్లో హర్షం వ్యక్తమవుతోంది. చాలా మంచి పనిచేశారంటూ అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా జడేజా దంపతులు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం ఇదేమి మొదటిసారికాదు. గతేడాది తమ పాప పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్థికంగా వెనకబడిన కొన్ని కుటుంబాలతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించిందట రివాబా. అంతేకాదు ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు డిపాజిట్ చేసిందట. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన 10 వేల మంది అమ్మాయిలకు అండగా నిలవాలని జడేజా దంపతులు గతంలో నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే ఈ సారి 101 మంది అమ్మాయిల పేర్ల మీద సుకన్య సమృద్ధి బ్యాంకు ఖాతాలు తెరిచారట.
కాగా కొవిడ్-19 సంక్షోభ సమయంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు జడేజా. జామ్ నగర్‌లో నివాసముండే అతను చుట్టు పక్కల ప్రాంతాల్లోని నిరుపేదలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాడు. లాక్‌డౌన్ సమయంలో ఇళ్లకు రేషన్ సరుకులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నాడు. ఇక ఐపీఎల్-2022 సీజన్ మధ్యలో అర్ధాంతరంగా తప్పుకున్నాడు జడేజా. మొదట కెప్టెన్సీ కోల్పోయిన అతను గాయం కారణంగా సీజన్ మధ్యలోనే తప్పుకున్నాడు. రేపు ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి కూడా విశ్రాంతి తీసుకోనున్నాడు. జులైలో జరిగే ఇంగ్లండ్ పర్యటనతో మళ్లీ జట్టులో చేరవచ్చని తెలుస్తోంది.