IND vs SA: టీమిండియాకు భారీ షాక్.. టీ20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్, కుల్దీప్ ఔట్.. కెప్టెన్ ఎవరంటే..
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి 24 గంటల ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) సిరీస్‌కు దూరమయ్యాడు.
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభానికి 24 గంటల ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) సిరీస్‌కు దూరమయ్యాడు. అతనితో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గాయపడడంతో ప్రొటీస్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు . కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ ( Rishabh Pant) జట్టును ముందుండి నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. కాగా కండరాలు పట్టేయడం, తదితర సమస్యలతో కేఎల్ రాహుల్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుల్దీప్ యాదవ్ కుడి చేతికి గాయమైంది. బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో అతను గాయపడ్డాడు. కాగా ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతోంది. టీమ్‌ఇండియా. ఇప్పుడు గాయంతో కేఎల్ రాహుల్ తప్పుకోవడం భారతజట్టును ఇబ్బంది పెట్టే విషయమే. ఇక ఐపీఎల్-2022లో అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్ సేవల్ని కోల్పోతుండడం టీమిండియాకు పెద్ద మైనస్సేనని చెప్పుకోవచ్చు. కాగా రాహుల్, కుల్దీప్ యాదవ్‌ల స్థానంలో వచ్చే ఆటగాళ్ల పేర్లను ఇంకా ప్రకటించలేదు. వీరిని శిక్షణ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపనున్నారు.
NEWS ?- KL Rahul and Kuldeep Yadav ruled out of #INDvSA series owing to injury.
ఇవి కూడా చదవండిThe All-India Senior Selection Committee has named wicket-keeper Rishabh Pant as Captain and Hardik Pandya as vice-captain for the home series against South Africa @Paytm #INDvSA
— BCCI (@BCCI) June 8, 2022
కాగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుందని. సిరీస్‌లో తొలి మ్యాచ్ రేపు ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈక్రమంలో కేఎల్ రాహుల్ నిష్క్రమణ టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో 51.33 సగటుతో 616 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వైఫల్యంతో పంత్ కెప్టెన్సీ సామర్థ్యంపై విమర్శలు వచ్చాయి. మరి సౌతాఫ్రికాతో సిరీస్‌లోనైనా టీమిండియాను విజయపథంలో నడిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
T20I సిరీస్ కోసం భారత జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (WK), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Mithali Raj: మన లేడీ సచిన్ ఆస్తులెంతో తెలుసా? ఆమె దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..