Sai Pallavi: న్యాచురల్‌ బ్యూటీకి తాను పెద్ద ఫ్యాన్‌ అంటోన్న బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌.. విరాట పర్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ..

Virata Parvam: రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి (Saipallavi) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. నీది నాదీ ఒకే కథ సినిమాతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Sai Pallavi: న్యాచురల్‌ బ్యూటీకి తాను పెద్ద ఫ్యాన్‌ అంటోన్న బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌.. విరాట పర్వం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ..
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2022 | 7:00 PM

Virata Parvam: రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి (Saipallavi) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విరాట పర్వం. నీది నాదీ ఒకే కథ సినిమాతో ఆకట్టుకున్న వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రం బృందం. ఇటీవల ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. నక్సలిజానికి ప్రేమకథను జోడించి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించింది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈక్రమంలో పలువురు సినిమా సెలబ్రిటీలు విరాటపర్వం (Virata Parvam) ట్రైలర్‌ను మెచ్చుకుంటూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ (Karan Johar) సైతం ఈ ట్రైలర్‌పై స్పందించాడు.

విరాట పర్వం ట్రైలర్‌ విడుదల చేసినట్లు రానా ట్వీట్‌ చేయగా దానిని రిట్వీట్‌ చేశాడు కరణ్‌. ‘ విరాట పర్వం ట్రైలర్‌ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది రానా. సినిమాను చూడడానికి ఎదురుచూస్తున్నాను. నువ్వు సూపర్. ఇంక నేను సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. కాగా విరాటపర్వంలో మరో హీరో నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, ప్రియమణి, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ఇప్పటికే 7.4 మిలియన్ల వ్యూస్‌ని దాటేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

శరీరంలో కొవ్వును సులభంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పదార్థాలను మీ డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

Mithali Raj: మన లేడీ సచిన్‌ ఆస్తులెంతో తెలుసా? ఆమె దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..

Varun Dhawan: ‘మా నాన్న టార్చర్‌ పెడుతున్నాడు.. కాపాడండి’ అంటూ స్టార్‌ హీరోను రిక్వెస్ట్‌ చేసిన లేడీ ఫ్యాన్..

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!