IND vs SA: నేనెప్పుడూ వకార్‌ను ఫాలో కాలేదు.. కెరీర్‌ ఆరంభం నుంచే వారినే ఆరాధిస్తున్నా.. ఉమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Umran Malik: ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు...

IND vs SA: నేనెప్పుడూ వకార్‌ను ఫాలో కాలేదు.. కెరీర్‌ ఆరంభం నుంచే వారినే ఆరాధిస్తున్నా.. ఉమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Umran Malik
Follow us

|

Updated on: Jun 06, 2022 | 10:00 PM

Umran Malik: ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భీకరమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అతను సీజన్‌లో మొత్తం 22 వికెట్లు తీసుకున్నాడు. తద్వారా ఏకంగా టీమిండియాలో చోటు సంపాదించాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో అతను భారత జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు. కాగా ఉమ్రాన్‌ మాలిక్‌ (Umran Malik) బౌలింగ్‌ను చూస్తుంటే పాక్‌ దిగ్గజ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ గుర్తుకొస్తున్నాడంటూ ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌లీ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉమ్రాన్‌ను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఎప్పుడూ వకార్‌ను అనుసరించలేదని, టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లే తనకు ఆదర్శమంటూ చెప్పుకొచ్చాడు.

నాకంటూ ఓ స్టైల్‌ ఉంది..

“నేను వకార్ బౌలింగ్‌ను ఎప్పడూ ఫాలో కాలేదు. నాకంటూ ఓ బౌలింగ్‌ శైలి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ లను నేను క్రికెట్‌లో ఎక్కువగా ఆరాధిస్తాను. నా కెరీర్‌ ఆరంభం నుంచే ఈ ముగ్గరి దిగ్గజాలను అనుసరిస్తూనే ఉన్నాను. దేశం తరపున ఆడడం నాకెప్పుడూ గర్వంగా ఉంటుంది. ఆ అవకాశం దక్షిణాఫ్రికా సిరీస్‌తో లభించింది. ఈ సిరీస్‌లో టీమిండియాను గెలిపించడమే నా ఏకైక లక్ష్యం’ అని మాలిక్‌ చెప్పుకొచ్చాడు. కాగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జూన్‌9న జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral video: ఎద్దు ముందు ఇన్‌స్టా రీల్స్‌ చేయాలనుకుంది.. చివరకు ఏమైందంటే..

Weight loss Tips: సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే..

Vikram- Amul: విక్రమ్‌ చిత్ర బృందానికి క్రియేటివ్‌గా విషెస్‌ చెప్పిన అమూల్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న కమల్‌ డూడుల్‌..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ