Nazriya Nazim: గ్యాప్‌ రాలేదు.. నేనే తీసుకున్నాను.. సినిమా కెరీర్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌..

Ante Sundaraniki: రెండేళ్ల గ్యాప్ అనంత‌రం 2022లో అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎంట్రీ ఇస్తోంది. నాచురల్‌ స్టార్‌ నాని (Nani) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నాడు. మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా లాంటి హిట్‌ మూవీస్‌ను తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు..

Nazriya Nazim: గ్యాప్‌ రాలేదు.. నేనే తీసుకున్నాను.. సినిమా కెరీర్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌..
Nazriya Nazim
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 06, 2022 | 6:36 AM

Ante Sundaraniki: రాజారాణి సినిమాతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్‌(Nazriya Nazim). ఆ సినిమాలో ఆమె అభినయం, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లకు చాలామంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. తమిళ, మలయాళ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె 2014 తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. 2018లో మళ్లీ రెండు సినిమాల్లో కనిపించింది. ఆతర్వాత మళ్లీ నటనకు దూరమై 2020లో దర్శనమిచ్చింది. ఆపై రెండేళ్ల గ్యాప్ అనంత‌రం 2022లో అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎంట్రీ ఇస్తోంది. నాచురల్‌ స్టార్‌ నాని (Nani) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నాడు. మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా లాంటి హిట్‌ మూవీస్‌ను తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటోంది చిత్రబృందం. కాగా ఈ సందర్భంగా ఓ ఈవెంట్‌లో మాట్లాడిన నజ్రియా తన సినిమా కెరీర్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

‘నేను ఒక సినిమా పూర్తయ్యాక కావాల‌నే బ్రేక్‌ తీసుకుంటాను. ఆ బ్రేక్ రెండేళ్ల వరకూ ఉండొచ్చు. అయితే నేను సినిమాలను రిజెక్ట్‌ చేస్తున్నానని చాలా మంది అనుకుంటారు. అలాంటిదేమి ఉండ‌దు. నేను వెకేష‌న్ మూడ్‌లో ఉన్నప్పుడు సినిమాలు చేయను. నా జర్నీలో నేను పూర్తిగా నిమగ్నమై ఉంటాను. ఒక్కోసారి కథలు విన్నా యాక్టివ్‌గా ఉండను. నేను నా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. మొదట్లో అభిమానులు, ఫాలోవ‌ర్లు నా రీ ఎంట్రీని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకునేవారు. అయితే నేను ఎక్కువగా బ్రేక్ తీసుకుంటానని ఇపుడు నా ఫ్యాన్స్‌ అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్లు నా రీఎంట్రీని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం మానేశారు. అయితే ఎక్కువ‌కాలం వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ నా ఫ్యాన్స్‌ నన్ను గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని అందిస్తోంది’ అని మురిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Also Read:

French Open 2022: రోలాండ్‌ గ్యారోస్‌లో రఫెల్‌ రాజసం.. రికార్డు స్థాయిలో 14వ సారి టైటిల్‌ను కైవసం చేసుకున్న స్పెయిన్‌ బుల్‌..

Salman Khan: బాలీవుడ్‌ భాయ్‌జాన్‌కు బెదిరింపు లేఖ.. సిద్ధూలానే హతమారుస్తామంటూ..

వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే వీటిని డైట్‌లో చేర్చుకోవాల్సిందే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ