Vikram Movie: కమల్‌ సినిమాలో క్యామియో రోల్‌.. సూర్య ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు..

Vikram Movie: ఈ సినిమాలో సూర్య (Suriya) కేవలం 5 నిమిషాలు కనిపించినా.. సినిమాకు అదే పెద్ద అస్సెట్‌గా నిలిచిందని చాలామంది చెబుతున్నారు. ఇదే క్రమంలో ఈ క్యామియో రోల్ కోసం సూర్య ఎంత ఫీజు తీసుకున్నాడనే విషయంపై సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి.

Vikram Movie: కమల్‌ సినిమాలో క్యామియో రోల్‌.. సూర్య ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు..
Vikram
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jun 05, 2022 | 8:51 AM

Vikram Movie: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) నటించిన తాజా చిత్రం విక్రమ్‌ (Vikram). ఖైదీ, మాస్టర్‌ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన లోకేష్‌ కనగరాజ్‌ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. కమల్‌తో పాటు ఫాహద్‌ ఫాజిల్‌, విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) లాంటి సూపర్‌ స్టార్లు ఈ చిత్రంలో నటించారు. అదేవిధంగా సూర్య అతిథి పాత్రలో మెరిశాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం (జూన్‌3)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్‌ మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. కాగా ఈ సినిమాలో సూర్య (Suriya) కేవలం 5 నిమిషాలు కనిపించినా.. సినిమాకు అదే పెద్ద అస్సెట్‌గా నిలిచిందని చాలామంది చెబుతున్నారు. ఇదే క్రమంలో ఈ క్యామియో రోల్ కోసం సూర్య ఎంత ఫీజు తీసుకున్నాడనే విషయంపై సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. అయితే ఈ సినిమా కోసం సూర్య ఎలాంటి పారితోషకం తీసుకోలేదట. కమల్ మీద అభిమానంతో అడిగిన వెంటనే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ పాత్ర పోషించడానికి అంగీకరించారట.

నా కల నెరవేరింది..

ఇవి కూడా చదవండి

కాగా కమల్‌తో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోవాలన్నది సూర్య ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. విక్రమ్‌ సినిమాతో అది నెరవేరిందని తాజాగా ట్వీట్‌లో రాసుకొచ్చాడు సూర్య. ‘ప్రియమైన కమల్‌హాసన్‌ అన్నా మీతో కలిసి నటించాలన్న నా కల నెరవేరింది. దీన్ని సాకారం చేసిన దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌కు ధన్యవాదాలు’ అని సూర్య ట్వీట్‌ చేయగా.. దానికి కమల్‌ కూడా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘డియర్‌ సూర్య తంబి.. మనం కలిసి ఓ సినిమా చేయాలన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది నీకు కూడా తెలుసు. నీ దగ్గర అపారమైన ప్రేమ ఉంది. ఆల్‌ ది బెస్ట్‌ తంబి.. సారీ.. తంబి సర్‌’ అంటూ సూర్యను ప్రశంసించారు. కాగా విక్రమ్‌ లో పాత్ర గురించి సూర్యకు ఫోన్‌ చేసిన వెంటనే ఒప్పుకున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కమల్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Viral Video: హార్స్‌ రేసింగ్‌ ట్రాక్‌లోకి దూసుకొచ్చిన మొసలి.. హడలిపోయిన గుర్రం.. చివరకు ఏం జరిగిందంటే..

Allu Arjun: మేజర్‌ సినిమాపై బన్నీ ప్రశంసల వర్షం.. ప్రతి భారతీయుడి గుండెను తాకే సినిమా అంటూ..

T20 Blast: 63 పరుగులకు 9 వికెట్లు.. నిప్పులు చెరుగుతోన్న రాజస్థాన్ ప్లేయర్.. ప్రత్యర్థుల డమాల్.