Kamal Haasan’s Vikram: భారీ ధరకు ‘విక్రమ్’ మూవీ ఓటీటీ రైట్స్.. డిజిటల్ ఎంట్రీఇచ్చేది అప్పుడేనా..

లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Kamal Haasan's Vikram: భారీ ధరకు 'విక్రమ్' మూవీ ఓటీటీ రైట్స్.. డిజిటల్ ఎంట్రీఇచ్చేది అప్పుడేనా..
Vikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2022 | 3:26 PM

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్(Vikram). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. చాలా కాలం తర్వాత కమల్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఖైదీ లాంటి కొత్త కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లోకేష్.. ఆ తర్వాత విజయ్ తో కలిసి మాస్టర్ సినిమా చేశాడు. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగా రాబట్టింది. ఇక ఇప్పుడు విక్రమ్ సినిమా మాత్రం సాలిడ్ హిట్ అందుకుంది. విక్రమ్ సినిమాలో కమల్ తో పాటు మరికొంత మంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే హీరో సూర్య చిన్న పాత్రలో మెరిసి మెప్పించారు. ఊహించని ట్విస్ట్ లతో అదిరిపోయే ఎలివేషన్స్ తో విక్రమ్ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన ఓ వార్త ఫిలిమ్స్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. విక్రమ్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఆరు వారలతర్వాత ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది. ఇక విక్రమ్ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 9 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. త్వరలోనే విక్రమ్ ఓటీటీ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి