AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాని మూవీ.. రన్ టైం ఎంతంటే..

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించాడనికి రానుంది.

Ante Sundaraniki : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నాని మూవీ.. రన్ టైం ఎంతంటే..
Ante Sundaraniki
Rajeev Rayala
|

Updated on: Jun 04, 2022 | 4:48 PM

Share

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం అంటే సుందరానికి(Ante Sundaraniki).. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించాడనికి రానుంది. ఈ సినిమాలో నాని సరసన కేరళ కుట్టి నజ్రియా నజీమ్ నటిస్తుంది. ఈ సినిమాతో మొదటిసారి నజ్రియా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అదేవిధంగా రీసెంట్ గా వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది. నాని తన మార్క్ నటనతో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోనున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ ‘యూ’ (U) సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్ వారు చూడొచ్చు. ఈ సినిమా మొత్తం రన్ టైం 2 గంటల 56 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ నరేష్ – రోహిణి – శ్రీకాంత్ అయ్యంగార్ – నదియా – హర్ష వర్ధన్ – రాహుల్ రామకృష్ణ – సుహాస్ – పృథ్వీరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. అలాగే అంటే సుందరానికి సినిమాను తమిళ్‪ లో ‘అడాడే.. సుందరా’ – మలయాళంలో ‘ఆహా.. సుందరా’ అనే పేర్లతో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై