Major: ప్రేక్షకులను మెప్పిస్తున్న మేజర్.. తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే

యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ లేటెస్ట్ గా మేజర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన 26/11 దాడుల్లో వీర మరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్‌'.

Major: ప్రేక్షకులను మెప్పిస్తున్న మేజర్.. తొలి రోజు ఎంత వసూల్ చేసిందంటే
Major
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2022 | 5:03 PM

యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్(Adivi Sesh )లేటెస్ట్ గా మేజర్(Major)గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన 26/11 దాడుల్లో వీర మరణం పొందిన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన  ఈ సినిమాను జూన్‌3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’లో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించారు.

సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు భారీగానే వసూల్ చేసింది. అడవి శేష్ మార్కెట్ కంటే ఐదు రేట్లు వసూల్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.7.12 కోట్ల షేర్ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మేజర్ మూవీ వసూళ్లు ఎలాఉన్నాయంటే..  నైజాం – 1.75 కోట్లు, సీడెడ్ – 46 లక్షలు, ఉత్తరాంధ్ర – 51 లక్షలు, ఈస్ట్ – 34 లక్షలు, వెస్ట్ – 24 లక్షలు, గుంటూరు – 30 లక్షలు, కృష్ణా – 28 లక్షలు, నెల్లూరు – 19 లక్షలు. మొత్తంగా  ఏపీ,తెలంగాణ కలిపి రూ.4.07 కోట్లు(రూ.6.85 కోట్ల గ్రాస్) అలాగే రెస్టాఫ్ ఇండియా – 0.35 కోట్లు, ఇక హిందీ – 0.35 కోట్లు, ఓవర్సీస్ – 2.35 కోట్లు , టోటల్ వరల్డ్ వైడ్ – రూ.7.12 కోట్లు (రూ.13.10 కోట్ల గ్రాస్) ను సొంతో చేసుకుంది మేజర్ మూవీ. వీకెండ్స్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి