Allu Aravind: ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన పాఠం అదే.. అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్

మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

Allu Aravind: ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన పాఠం అదే.. అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్
Allu Aravind
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2022 | 5:31 PM

మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand)హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఇప్పుడు పక్కా కమర్షియల్ అంటూ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. పక్కా కమర్షియల్ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్’లో భాగంగా ఈ మూవీ టీం ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యాక్రమంలో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు మారుతి, సీనియర్‌ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind), నిర్మాత బన్నీ వాసుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలపై హాట్ కామెంట్స్ చేశారు. ప్రెజంట్ ఇండస్ట్రీ నేర్చుకోవల్సిన పాఠం ఏంటంటే.. టికెట్ల రేట్లు తగ్గించాలి.. ఓటీటీల్లో ఆలస్యంగా సినిమాను వేయాలి అని అన్నారు. ఇటీవల సినిమా టికెట్ ధరలు పెంచడంతో సామాన్యులు థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడటానికి ఆలోచిస్తున్నారు. నెల రోజుల్లో ఓటీటీకి వస్తుందిలే అప్పుడు చూద్దాం అని అనుకుంటున్నారు సామాన్యులు. దాంతో ఆ ప్రభావం సినిమా పై.. బాక్సాఫీస్ కలెక్షన్స్ పైన పడుతుంది. ఈ నేపథ్యంలో అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లకు రావటమే మానేశారని..  దీంతో ప్రొమోషన్ బాధ్యత హీరోల మీద పడిందని అన్నారాయన. ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్ కు రావడం లేదు..సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కూడా రావాలి.. ఈ మధ్య ఓ పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చేశారనీ.. అలా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే బాధ్యత హీరో, హీరోయిన్లదేనని అన్నారు అల్లు అరవింద్. అరవింద్ కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..