The Warriorr: రామ్ పోతినేని ‘వారియర్’ నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ”దడ దడ” సాంగ్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ది వారియర్. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు రామ్.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్(Ram) హీరోగా తమిళ్ దర్శకుడు లింగు స్వామి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ది వారియర్(The Warriorr). ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు రామ్. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న లింగు స్వామి తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈ మూవీనుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ మూవీ. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది.
జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది వారియర్ మూవీ. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండో పాట ‘దడ దడ…’ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఈ రోజు విడుదల చేశారు. ‘దడదడమని హృదయం శబ్దం… నువ్వు ఇటుగా వస్తావని అర్థం! అంటూ సాగిన ఈ గీతానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ శ్రావ్యమైన మెలోడీ బాణీ సమకూర్చగా… శ్రీమణి సాహిత్యం అందించారు. హరిచరణ్ పాటను ఆలపించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు.