Jana Gana Mana: బుట్టబొమ్మకు వెల్కమ్ చెప్పిన ‘జనగణమన’ టీమ్..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు ముందుగా
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు ముందుగా ఈ కాంబోలో లైగర్ అనే సినిమా రాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు పూరి అండ్ విజయ్. జనగణమన(Jana Gana Mana) అనే టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
జనగణమన సినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు పూరి. అలాగే ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా అలరించనుందని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ వార్తలను నిజం చేస్తూ జనగణమన సినిమాలో హీరోయిన్ పూజ అని ప్రకటించారు చిత్రయూనిట్. పూజ హెగ్డేను వెల్కమ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు పూరి. ఈ వీడియోలో మూవీ మేకింగ్ చూపిస్తూనే ఛార్మి , పూరి కలిసి పూజాహెగ్డే కు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలు పెట్టనున్నారు. అక్కడ విజయ్, పూజా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వనుంది టీమ్. ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఛార్మి కౌర్ – దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 2023 ఆగస్టు 3న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.
కాగా విజయ్ దేవరకొండ జనగణమనతో పాటు ‘లైగర్’ మూవీలో నటిస్తున్నాడు. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్ట్ 25న విడుదల కానుంది. అదేవిధంగా విజయ్ దేవకొండ సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా చేయనున్నారు. ఇక పూజా హెగ్డే రీసెంట్ గా ‘రాధే శ్యామ్’, బీస్ట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అటు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’.. అలాగే రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న సర్కస్‌లో కనిపించనుంది.