Prashant Neel Birthday : గ్రాండ్‌గా ప్రశాంత్ నీల్ బర్త్ డే… సందడి చేసిన ప్రభాస్, యశ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డార్లింగ్. ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు కాస్త నిరాశ పరిచిందనే చెప్పాలి. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో డార్లింగ్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మాస్ మాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే నేడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ బెంగుళూర్ కు వెళ్లారు.
నిన్న బెంగుళూర్ వెళ్లిన ప్రభాస్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు రాకింగ్ స్టార్ యశ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. ప్రభాస్ , ప్రశాంత్ నీల్, యష్ కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ , యశ్ లను ఒకే ఫ్రెమ్ లో చూసిన అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. ప్రశాంత్ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 లతో సూపర్ హిట్స్ అందుకొని ఇప్పుడు ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఎన్టీఆర్ 30 చేస్తున్నాడు.. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.