Allu Arjun: మేజర్‌ సినిమాపై బన్నీ ప్రశంసల వర్షం.. ప్రతి భారతీయుడి గుండెను తాకే సినిమా అంటూ..

Major Movie: మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) మేజర్‌ సినిమాపై స్పందించాడు.

Allu Arjun: మేజర్‌ సినిమాపై బన్నీ ప్రశంసల వర్షం.. ప్రతి భారతీయుడి గుండెను తాకే సినిమా అంటూ..
Allu Arjun
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2022 | 9:11 PM

Major Movie: యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) నటించిన తాజా చిత్రం మేజర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ అధికారి సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించారు. గూడఛారి ఫేం శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ మూవీతో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిలిం ఇండియా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. టీజర్లు, ట్రైలర్లతోనే అంచానలు పెంచేసిన మేజర్‌ చిత్రం జూన్‌ 3న థియేటర్లలో గ్రాండ్‌ గా రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) మేజర్‌ సినిమాపై స్పందించాడు.

మహేశ్‌ బాబుకు ప్రత్యేక అభినందనలు..

ఇవి కూడా చదవండి

‘మేజర్‌ చిత్రబృందానికి శుభాకాంక్షలు. సినిమా మనసును హత్తుకునేలా ఉంది. మ్యాన్‌ ఆఫ్‌ ద షో అడివిశేష్‌ సిల్వర్‌ స్ర్కీన్‌పై మరోసారి మ్యాజిక్‌ చేశాడు. ప్రకాశ్‌రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన బీజీఎమ్‌ అయితే మతి పోగొడుతోంది. డైరెక్టర్‌ శశికిరణ్‌ సినిమాను చాలా అద్భుతంగా, అందంగా మలిచాడు. గుండెల్ని పిండేసే సినిమాను అందించిన నిర్మాత మహేశ్‌బాబుగారికి ప్రత్యేక అభినందనలు. ప్రతి భారతీయుడి గుండెను తాకే గొప్ప సినిమా మేజర్‌’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు బన్నీ. కాగా అల్లు అర్జున్‌ పోస్ట్‌పై హీరో అడివి శేష్‌ కూడా స్పందించాడు. ‘క్షణం సినిమా నుంచి మేజర్‌ వరకు మీరు చూపించిన ప్రేమ, అందించిన సపోర్ట్‌కు కృతజ్ఞతలు. నా పుట్టినరోజు(డిసెంబర్‌ 17) పుష్ప గిఫ్టిచ్చారు. ఇప్పుడు మేజర్‌ సినిమా విజయాన్ని మరింత అందంగా మార్చారు’ అని రిప్లై ఇచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

T20 Blast: 63 పరుగులకు 9 వికెట్లు.. నిప్పులు చెరుగుతోన్న రాజస్థాన్ ప్లేయర్.. ప్రత్యర్థుల డమాల్..

Namita: వేడుకగా హీరోయిన్‌ సీమంతం.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

Priyamani Birthday: చేతినిండా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, రియాల్టి షోలు.. ప్రియమణి స్పీడ్‌ మాములుగా లేదుగా..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి