Brad Johnson: కరోనా రక్కసికి బలైన మరో యాక్టర్.. బ్రాడ్ జాన్సన్ కోవిడ్‌తో పోరాడుతూ మృతి
ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కరోనా వలన కోల్పోయారు. ఇప్పుడు తాజాగా మరో నటుడు పేరు కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తుల జాబితాలో చేరింది.
Brad Johnson: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను కోల్పోయారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చలన చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కరోనా వలన కోల్పోయారు. ఇప్పుడు తాజాగా మరో నటుడు పేరు కరోనా వైరస్ (Corona Virus) తో మరణించిన వ్యక్తుల జాబితాలో చేరింది. హాలీవుడ్ (Hollywood) నటుడు బ్రాడ్ జాన్సన్ వైరస్‌తో పోరాడుతూ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రాడ్ జాన్సన్ చికిత్స తీసుకుంటూ.. కరోనా సంబంధిత అనారోగ్యంతో మరణించాడు. నటుడు మరణ వార్తను అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అతని వయస్సు 62. అతనికి భార్య.. ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు.
బ్రెడ్ సన్నిహితుడు అతని మరణాన్ని ధృవీకరించాడు:
టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో COVID-19 సమస్యలతో జాన్సన్ 2022 ఫిబ్రవరి 18న మరణించినట్లు అతని ప్రతినిధి లిండా మెక్‌అలిస్టర్ ది హాలీవుడ్ రిపోర్టర్‌కి ధృవీకరించారు.
View this post on Instagram
బ్రాడ్ కుటుంబం మార్చి 2022లో ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది. అందులో వారు నటుడిని నిజమైన పునరుజ్జీవనోద్యమ వ్యక్తిగా సంబోధించారు. నివాళి అర్పిస్తూ.. ఈ సమయంలో అతను నటన ప్రతిభతో చాలామందితో ప్రశంసలు అందుకున్నారు. అయితే, వారు చాలా త్వరగా మా నుండి దూరంగా ఉన్నారు. బ్రాడ్ ముందుగానే వెళ్లిపోయారు. బ్రాడ్ తన జీవితాన్ని పూర్తిగా జీవించారు. కనుక అదే సమయంలో అతను తన పిల్లలు నిష్కళంకమైన రీతి జీవించాలని సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు. అతని జీవన శైలి అద్వితీయమైనది.. అద్భుతమైనది. అవి మరచిపోలేని విధంగా ఉండేవంటూ బ్రాడ్ జాన్సన్ వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు.
బ్రాడ్ జాన్సన్ కుటుంబం గురించి తెలుసుకోండి బ్రాడ్ జాన్సన్ భార్య లారీ 35 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. అతనికి 8 మంది పిల్లలు. వారిలో 6 మంది కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. హాలీవుడ్‌లో చాలా చిత్రాలలో పనిచేశారు. అంతేకాదు పలు టీవీ షోలలో కూడా కనిపించారు. అలా అక్కడ వాణిజ్య ప్రకటనల్లో కూడా పనిచేశారు.