AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakira Gerard Pique Breakup: 12 ఏళ్ల బంధానికి గుడ్‌బై.. పిల్లల భవిష్యత్ కోసమే అంటూ ప్రకటించిన షకీరా-గెరార్డ్ పిక్..

2010 ప్రపంచ కప్ గీతం సందర్భంగా షకీరా మొదటిసారి గెరార్డ్ పిక్‌ని కలిసింది. షకీరా తన పాట 'వాకా వాకా (ఈ టైమ్ ఫర్ ఆఫ్రికా)'ని ప్రమోట్ చేయడానికి వచ్చింది. 2011 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.

Shakira Gerard Pique Breakup: 12 ఏళ్ల బంధానికి గుడ్‌బై.. పిల్లల భవిష్యత్ కోసమే అంటూ ప్రకటించిన షకీరా-గెరార్డ్ పిక్..
Shakira Gerard Pique Breakup
Venkata Chari
|

Updated on: Jun 05, 2022 | 5:59 AM

Share

హాలీవుడ్ సింగర్ షకీరా(Shakira), ఆమె ప్రియుడు గెరార్డ్ పిక్ 12 ఏళ్ల తర్వాత విడిపోయారు. దీంతో వీరిద్దరి మధ్య బంధం ముగిసింది. గెరార్డ్ పిక్ వృత్తిరీత్యా సాకర్ ప్లేయర్. ఈ జంట శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. “మేం విడిపోతున్నామని తెలియజేయడానికి మాకు బాధగా ఉంది. మేం పిల్లల అభ్యున్నతి కోసం ఈ చర్య తీసుకున్నాం. ఈ సమయంలో మా పిల్లలే మా ప్రాధాన్యత. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన విడుదల చేశారు.

వీరిద్దరూ ఎలా కలిశారంటే?

2010 ప్రపంచ కప్ గీతం సందర్భంగా గెరార్డ్ పిక్‌తో షకీరా మొదటి సమావేశం జరిగింది. షకీరా తన పాట ‘వాకా వాకా (ఈ టైమ్ ఫర్ ఆఫ్రికా)’ని ప్రమోట్ చేయడానికి వచ్చింది. 2011లో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. ఇద్దరికి సాషా, మిలన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరి విడిపోవడానికి మరో మహిళతో గెరార్డ్ పిక్ ఎఫైర్ కారణమని వార్తలు వినిపిస్తు్న్నాయి. అయితే, వీటిపై ఎలాంటి అధికారిక వార్తలు వెలువడలేదు.

ఇవి కూడా చదవండి

జనవరి 2012లో, ఇద్దరూ కలిసి మొదటిసారిగా రెడ్ కార్పెట్ మీద కనిపించారు. స్విట్జర్లాండ్‌లోని ఫిఫా బాలన్ డి ఓర్ గాలాలో వీరిద్దరూ కనిపించారు. దీని తరువాత, సెప్టెంబర్ 2012 లో, షకీరా తన ప్రెగ్నెన్సీ వార్తలను ధృవీకరించింది. జనవరి 2013 లో, వారి మొదటి బిడ్డ, కుమారుడు మిలన్ జన్మించాడు. షకీరా యూఎస్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గెరార్డ్ తన ఫ్యామిలికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. అదే సమయంలో వీరిద్దరు పిల్లల సంరక్షణలో పూర్తిగా సహాయం చేసుకుంటామని వెల్లడించారు.

2014లో, షకీరా, గెరార్డ్ పిక్ వివాహం చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ, ఈ వార్తలను వారు కొట్టిపారేశారు. దీనిపై వారు మాట్లాడుతూ, మాకు కావాల్సినవన్నీ ఉన్నాయని, ఒకరికొకరు మద్దతు కూడా ఉంది, పెళ్లి చేసుకోవడం వల్ల ఏమీ మారదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక 2015 సంవత్సరంలో, ఈ జంట తమ రెండవ బిడ్డను త్వరలో స్వాగతించబోతున్నట్లు ప్రకటించారు. 2019 సంవత్సరంలో, షకీరా స్వర తంతువులలో రక్తస్రావం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, క్రమంగా అది విడిపోయేందుకు దారి తీసిందని తెలుస్తోంది.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ