AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ 4 వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేసే వేప.. ప్రతిరోజూ వాడండిలా..

Benefits Of Neem: వేపలో 130 కంటే ఎక్కువ జీవసంబంధ క్రియాశీల సమ్మేళనాలు ఉన్నాయని, ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే గుణాలు అందానికి ఉపయోగపడుతుంది.

Health Tips: ఈ 4 వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేసే వేప.. ప్రతిరోజూ వాడండిలా..
Neem
Venkata Chari
|

Updated on: Jun 04, 2022 | 7:06 AM

Share

వేప చెట్టు ఔషధ గుణాలతో నిండినదిగా పేరుగాంచింది. ఈ చెట్టులో వేప ఆకుల నుంచి బెరడు, గింజలు అనేక వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. అంతే కాదు ఇందులో ఉండే గుణాలు అందానికి ఎంతో ఉపయోగపడుతాయి. వేపలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జుట్టు ఉత్పత్తులు, టూత్ పేస్టులు మొదలైన వాటిలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇంకా చాలా చోట్ల నేటికీ వేప పళ్లను ఉపయోగిస్తునే ఉన్నారు. వేప లేత ఆకులు కూడా తింటూనే ఉంటారు. వేపలో 130 కంటే ఎక్కువ జీవసంబంధ క్రియాశీల సమ్మేళనాలు ఉన్నాయని, ఇది శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

1. చుండ్రు- చలికాలమైనా, వేసవికాలమైనా.. ప్రతి సీజన్‌లోనూ చుండ్రు సమస్య వస్తూనే ఉంటుంది. మీరు కూడా చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీరు వేప ఆకులను ఉపయోగించవచ్చు. దీని రసాన్ని తలకు పట్టిస్తే చుండ్రు తొలగిపోతుంది.

2. దంతాలు- వేప యాంటీ బాక్టీరియల్‌‌గా పని చేస్తుంది. ఇది దంతాలను ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. వేప పళ్ళు దంతాలను శుభ్రంగా ఉంచడంతోపాటు ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

3. రోగనిరోధక శక్తి- యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలతో యాంటీ ఆక్సిడెంట్లు వేపలో ఉన్నాయి. వేప ఆకులను తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

4. చర్మం- వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర రక్తాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడతాయి. వేప ఆకుల రసాన్ని చర్మానికి రాసుకుంటే మొటిమలు తొలగిపోతాయి.

గమనిక: కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం కోసమే అందించాం. వైద్యుల అభిప్రాయానికి ఇవి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించాలనుకుంటే ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోవాలి.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!