Corona Virus: ఆ రెండు రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..అప్రమత్తతే ముఖ్యం.. ఏ కొత్త వేవ్‌కు సంకేతం కాదన్న వైద్యులు

దేశంలో పెరుగుతున్న కేసులు ఏ కొత్త వేవ్ కు సంకేతం కాదని చెప్పారు. Omicron రెండు ఉప-వేరియంట్‌లు BA.4 , BA.5 (Omicron SUB VARIENTS BA.5 , BA.4) కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణం కావచ్చునని పేర్కొన్నారు.

Corona Virus: ఆ రెండు రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..అప్రమత్తతే ముఖ్యం.. ఏ కొత్త వేవ్‌కు సంకేతం కాదన్న వైద్యులు
Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Jun 03, 2022 | 7:18 PM

Corona Virus:గత రెండు రోజులుగా దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఒక్క రోజులో.. కొత్త ఇన్ఫెక్షన్ కేసుల్లో  సుమారు 9 శాతం పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 4041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌గా ఉన్న రోగుల సంఖ్య కూడా 21177కి పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా 0.95 శాతానికి పెరిగింది. దేశంలోని ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది.  కేరళ, మహారాష్ట్రల్లో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తిస్తోంది. ఈ రాష్ట్రాల్లో యాక్టివ్ పేషెంట్ల సంఖ్యతో పాటు, కరోనా పాజిటివ్ రేటు కూడా వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 34 శాతం కేరళ నుంచి మాత్రమే నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో.. ఈ పెరుగుతున్న కేసులు మళ్ళీ కోవిడ్ విజృంభణకు సంకేతమా అనే ప్రశ్న తలెత్తుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దీనికి సంబంధించి, కోవిడ్ నిపుణుడు డాక్టర్ యుధ్వీర్ సింగ్ Tv9 తో  మాట్లాడుతూ.. పెరుగుతున్న కేసులు ఏ కొత్త వేవ్ కు సంకేతం కాదని చెప్పారు. Omicron  రెండు ఉప-వేరియంట్‌లు BA.4 , BA.5 (Omicron  SUB VARIENTS BA.5 ,  BA.4) కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణం కావచ్చునని పేర్కొన్నారు.  దేశంలో కొంతమందికి ఇప్పటికీ వ్యాక్సిన్ అందలేదు. అటువంటి పరిస్థితిలో, వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులు ఈ వేరియంట్‌ల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. మూడవ వేవ్‌లో ఇన్‌ఫెక్షన్ నుండి బయటపడిన వారు ఇప్పుడు ఈ వైరస్ బారిన పడటం కూడా జరగవచ్చని అన్నారు. అయితే చింతించాల్సిన పనిలేదు. ఈ వేరియంట్‌ల లక్షణాలు కూడా ఓమిక్రాన్‌ని పోలి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, కొన్ని కేసులు పెరిగినప్పటికీ పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు.

కేరళ, మహారాష్ట్రల్లో కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే? 

కేరళ, మహారాష్ట్రల్లో పెరుగుతున్న కేసులపై  వైద్య అధికారులు స్పందిస్తూ.. గతంలో  ఇదే విధంగా ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరిగాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కేరళ, మహారాష్ట్రల్లో పెరుగుతున్నాయని అన్నారు. ఇది భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా కరోనా కేసులు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎండిమిక్ దశలో ఉంది. అంటే డెంగ్యూ, మలేరియా వంటి వైరస్ జ్వరాల మాదిరిగానే మన మధ్యనే ఉండిపోతుంది. అందుకే కరోనాలో వివిధ వేరియంట్స్ వస్తూనే ఉంటాయి.. కొన్ని రాష్ట్రాల్లో, కరోనా కేసులు పెరుగుతాయి మరియు కొంతకాలం తర్వాత తగ్గుతాయి.. అయితే ఎప్పటికీ రెండవ వేవ్ సమయంలో కనిపించిన కరోనా దశ ఎప్పటికీ రాదని.. ప్రజలు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..