Air Taxi: ట్రాఫిక్ జామ్ నుంచి త్వరలో ఉపశమనం.. వాహనదారులకు అందుబాటులోకి రానున్న ఎయిర్‌ ట్యాక్సీలు

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన డ్రోన్‌ ఫెస్టివల్‌లో ఈ-ప్లేన్‌ సంస్థ ఎయిర్‌ట్యాక్సీ మోడల్‌ను ప్రదర్శించారు. ఈ-20 పేరుతో రూపొందించబడిన ఈ ఎయిర్‌ ట్యాక్సీ నమూనాను అందరూ ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

Air Taxi: ట్రాఫిక్ జామ్ నుంచి త్వరలో ఉపశమనం.. వాహనదారులకు అందుబాటులోకి రానున్న ఎయిర్‌ ట్యాక్సీలు
Air Taxi
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2022 | 10:01 AM

Air Taxi: పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ప్రయాణాలు చేయాలంటే.. వాహనదారులే కాదు.. ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే.. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారంటే చాలు.. ఒకొక్కసారి ఆ ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడడానికి గంటల సమయం ఎదురుచూడాల్సి ఉంటుంది. అయితే టాఫిక్ తో ఇబ్బంది పడేవారికి గుడ్‌న్యూస్‌.. ఇకపై ట్రాఫిక్‌ ఇబ్బందులనుంచి ఉపశమనం కలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అవును.. త్వరలోనే ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి. ఈ ప్లేన్‌ అనే సంస్థ ఎయిర్‌ ట్యాక్సీలను రూపొందించింది. ఇద్దరు వ్యక్తులు కూర్చుని ప్రయాణించే విధంగా ఒక చిన్న సైజు హెలికాఫ్టర్‌ లా దీన్ని రూపొందించారు. 2023లో ట్రయల్స్‌ నిర్వహిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన డ్రోన్‌ ఫెస్టివల్‌లో ఈ-ప్లేన్‌ సంస్థ ఎయిర్‌ట్యాక్సీ మోడల్‌ను ప్రదర్శించారు. ఈ-20 పేరుతో రూపొందించబడిన ఈ ఎయిర్‌ ట్యాక్సీ నమూనాను అందరూ ఎంతో ఆసక్తిగా వీక్షించారు.

ఇది హెలికాప్టర్‌లాగే గాలిలో ఎగురుతుంది. ఇందులో పైలట్‌కు ఒక సీటు, ప్రయాణికుడు కూర్చునేందుకు వీలుగా మరో సీటు ఇలా రెండు సీట్లు ఉంటాయి. 12 ప్లాస్టిక్‌ పేపర్‌ రోటర్‌లను ఇందులో అమర్చారు. ఇది గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఇంకా 3 వేల మీటర్ల ఎత్తువరకు ఎగురుతుందని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ ట్యాక్సీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇక ఈ ట్యాక్సీ 5 మీటర్ల పొడవు 5 మీటర్లు వెడల్పుతో ఉంటుంది. దీనికన్నా చిన్న సైజులో 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో మరో మోడల్‌ తయారు చేస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ట్యాక్సీకి ఈ-50 అని నామకరణం చేశారు.. ఇంకా ఇంజిన్‌ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..