AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

K Pop Star: కొరియన్ పాప్ మ్యూజిక్ సింగర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన ఒడిశా అమ్మాయి.. శిక్షణ కోసం సియోల్ పయనం..

ఐదుగురు అమ్మాయిలతో ఏర్పడిన బ్లాక్‌స్వాన్‌ గ్రూప్. ఈ గ్రూప్ నుంచి హేమే నవంబర్ 2020లో గ్రూప్ నుండి నిష్క్రమించింది. అనంతరం.. గ్రూప్ ప్రమోటర్ DR మ్యూజిక్ సంస్థ గత ఏడాది మేలో గ్లోబల్ ఆడిషన్‌లను ప్రకటించింది.

K Pop Star: కొరియన్ పాప్ మ్యూజిక్ సింగర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన ఒడిశా అమ్మాయి.. శిక్షణ కోసం సియోల్ పయనం..
K Pop Singer Shreya Lenka
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2022 | 3:54 PM

K Pop Star: కొరియన్ పాప్ మ్యూజిక్ కు ప్రపంచ వ్యాప్తంగా యువతలో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కే పాప్  ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత శైలి. కొరియన్ పాప్ బ్యాండ్ లో బీటీఎస్, బ్యాండ్ బ్లాక్‌స్వాన్‌ వంటి అనేక గ్రూపులున్నాయి. అయితే తాజాగా కే పాప్ సింగర్ గా ఒక భారతీయ గాయని మారనుంది. ఒడిశాకు చెందిన 18 ఏళ్ల గాయని శ్రేయ లెంకా కొరియన్ పాప్ మ్యూజిక్ లో అడుగు పెట్టనున్న మొట్టమొదటి భారతీయ స్టార్‌గా ఎంపికైంది.  బ్రెజిలియన్ అమ్మాయితో కలిసి బ్లాక్‌స్వాన్‌ బ్యాండ్ లో తన గానాన్ని వినిపించనుంది.

గత సంవత్సరం డిసెంబర్‌లో ఒడిశాకు రూర్కెలా నగరానికి చెందిన శ్రేయ బ్లాక్‌స్వాన్‌లో మెంబర్‌గా ఎంపికకావడానికి ఆడిషన్ ఇచ్చింది. ఈ మేరకు సియోల్‌లో చివరి దశ శిక్షణకు ఎంపికైంది. ఐదుగురు అమ్మాయిలతో ఏర్పడిన బ్లాక్‌స్వాన్‌ గ్రూప్. ఈ గ్రూప్ నుంచి హేమే నవంబర్ 2020లో గ్రూప్ నుండి నిష్క్రమించింది. అనంతరం.. గ్రూప్ ప్రమోటర్   DR  మ్యూజిక్ సంస్థ గత ఏడాది మేలో గ్లోబల్ ఆడిషన్‌లను ప్రకటించింది. యూ ట్యూబ్ ఆడిషన్ ప్రోగ్రామ్ లో సుమారు 4,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బ్రెజిల్‌కు చెందిన గాబ్రియేలా డాల్సిన్, మన దేశానికి చెందిన శ్రేయ లెంకా లు ఎంపికయ్యారు. దీంతో కొరియన్ పాప్ బ్యాండ్ లో చేరిన ఎంపిక అయిన భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SRIYA (@shreya.lenka)

శ్రేయా,  గాబ్రియేలా ఇద్దరూ ప్రాక్టీస్ కోసం కొన్ని నెలల పాటు సియోల్‌లో ఉంటారు. అనంతరం ఈ గ్రూప్ నెక్స్ట్ ఆల్బమ్‌ను విడుదల చేయనుంది.  స్వరం, రాప్, వ్యక్తిగత శిక్షణ, భాష, సంగీత వాయిద్యాలు తదితర అంశాలు  శిక్షణగా ఇవ్వనున్నారు.

శ్రేయా 12 సంవత్సరాల వయస్సు నుండి ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు ఫ్రీస్టైల్, హిప్-హాప్ ,  కాంటెంపరరీ డ్యాన్స్ నేర్చుకుంది. లక్షలాది మంది భారతీయ యువకుల్లా K-పాప్‌ శ్రేయాని కూడా ఆకర్షించింది. ఇప్పుడు ఆమె K-పాప్ కల నెరవేర్చుకుంది.  ఆడిషన్ లో పాల్గొనే సమయంలో శ్రేయా ఆన్‌లైన్‌లో కొరియన్ నేర్చుకుంది,  భాష, సంస్కృతి రెండింటినీ నేర్చుకోవడానికి చాలా కొరియన్ డ్రామాలను చూసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న లెంక తండ్రి అవినాష్ లెంక మాట్లాడుతూ, తన కుమార్తె కె-పాప్ స్టార్‌గా అవతరించిన మొదటి భారతీయురాలు అవుతుందని విన్న తర్వాత తాను చాలా సంతోషించానని చెప్పారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

.