NTR Wedding Photo: నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ పెళ్లి పత్రిక.. 1942లో మే 2 నాటి శుభలేఖ

పెళ్లితో కొత్త ఆలోచ‌న‌లు ఆశ‌లు..స‌రికొత్త బంధాల‌తో జీవితం ప్రారంభం అవుతుంది. అందుకనే వివాహానికి సంబంధించిన ఏ గుర్తులు అయినా ఎంతో ప్ర‌త్యేకం. తాజాగా స్వర్గీయ ఎన్టీఆర్ బసవతారకం ల పెళ్లి శుభలేఖ మళ్ళీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

NTR Wedding Photo: నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ పెళ్లి పత్రిక.. 1942లో మే 2 నాటి శుభలేఖ
Sr Ntr Wedding Card
Follow us
Surya Kala

|

Updated on: May 29, 2022 | 10:12 AM

NTR Wedding Photo: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే తెలుగునాట తెలియని వారుండరు. ఆంధ్రుల ఆరాధ్య దైవం గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ అప్పటి జనరేషన్ వారికే కాదు.. ఇప్పటి వారికి సైతం ఓ రోల్ మోడల్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ చైతన్య తీసుకువచ్చిన మహా నేత.

జీవితంలో అన్నింటిలో కెల్లా ముఖ్యమైన ఘట్టం వివాహం. అప్ప‌టి వ‌ర‌కూ ఒక‌విధంగా ఉన్న జీవితం పెళ్లితో పూర్తిగా మారిపోతుంది. కొత్త ఆలోచ‌న‌లు ఆశ‌లు..స‌రికొత్త బంధాల‌తో జీవితం ప్రారంభం అవుతుంది. అందుకనే వివాహానికి సంబంధించిన ఏ గుర్తులు అయినా ఎంతో ప్ర‌త్యేకం. ఇక, వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నందమూరి తారకరామారావు 1942లో మే 2 న వివాహం చేసుకున్నారు. తాజాగా ఒక‌ప్ప‌టి పెళ్లిప‌త్రిక గత రెండేళ్లుగా వైర‌ల్ అవుతోంది. ఈ పెళ్లి పత్రికని పెళ్లి కుమార్తె తండ్రి కాట్రగడ్డ చెంగయ్య ప్రింట్ చేయించారు. ప్రస్తుం ఈ ఫొటో అన్ని సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో తెగ ప్రచారం అవుతుంది. ఒక అభిమాని ఆ ఆహ్వాన పత్రికకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Ntr Wedding Card

Ntr Wedding Card

ఇక ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం చనిపోవడంతో 1985లో ఆమె జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక, మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలచారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి