Super Star Krishna: మహేష్‏ను అలా అడిగినందుకు స్టూడియో మొత్తం పరిగెత్తించాడు.. సూపర్ స్టార్ కృష్ణ కామెంట్స్..

కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోల పాత్రలను తెలుగువారికి పరిచయం చేశారు. గత కొంత కాలంగా కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Super Star Krishna: మహేష్‏ను అలా అడిగినందుకు స్టూడియో మొత్తం పరిగెత్తించాడు.. సూపర్ స్టార్ కృష్ణ కామెంట్స్..
Super Star Krishna
Follow us
Rajitha Chanti

|

Updated on: May 29, 2022 | 10:24 AM

సూపర్ స్టార్ క్రిష్ణ.  వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో అగ్రకథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు (Super Star Krishna). తేనె మనసులు సినిమాతో వెండితెరకు పరిచయమైన కృష్ణ.. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోల పాత్రలను తెలుగువారికి పరిచయం చేశారు. గత కొంత కాలంగా కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు గిఫ్ట్ ఇచ్చేందుకు కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని.. తన తండ్రిని ఇంటర్వ్యూ చేశారు.. ఇందుకు సంబంధించిన ప్రోమోను మంజుల తన సొంత యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది. కృష్ణ ఇంటర్వ్యూ ఫుల్ వీడియోను మే 31న విడుదల చేయనున్నట్లు తెలిపారు.. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో సూపర్ స్టార్ కృష్ణ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లుగా చూపించారు.

కృష్ణ స్కిన్ గురించి మంజుల అడగ్గా.. దేవుడి దయతో ఇంకా మెరుస్తూనే ఉందన్నారు.. అలాగే ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటున్నానని.. పనిలేకుండా బయటకు వెళ్లట్లేదన్నారు.. నాన్న కానిస్టిట్యూషన్ వచ్చిందని మహేష్ తనను చూసి కుల్లుకుంటాడని మంజల చెప్పుకొచ్చింది. ఇక హీరో కావాలని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని అడగ్గా.. ఏ ఉద్యోగం చేయను. సినిమా హీరో కావాలనే ఏ ఉద్యోగం చేయలేదన్నారు. గూఢచారి 116 సినిమాలో నిన్ను హీరోగా చేయాలనుకుంటున్నాము.. అడ్వాన్స్ వెయ్యి తీసుకొని కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టు అన్నారంటూ ఆనాటి విషయాలను చెప్పుకొచ్చారు.. అలాగే.. మహేష్ చిన్నప్పుడు షూటింగ్ చూసేందుకు స్టూడియోకు వచ్చాడని.. షూటింగ్ జరుగుతుండగా.. దూరంగా కూర్చొని చూసేవాడని.. నేను వెళ్లి నువ్వు యాక్ట్ చేస్తావా ? చేయవా.. ? అని అడిగా.. వెంటనే నేను చేయను, చేయను అంటూ స్టూడియో అంతా పరిగెత్తించాడు అంటూ చెప్పుకొచ్చారు కృష్ణ.

ఇవి కూడా చదవండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?