- Telugu News Photo Gallery Cinema photos Sr NTR birth anniversary: 5 iconic performances by the legendary actor
NTR Jayanti: ఎన్టీఆర్ సినీ కెరీర్లో ముఖ్యమైన పౌరాణిక పాత్రలు.. తన నటనతో ప్రశంసలను అందుకున్న సినిమాలు ఏమిటంటే..
NTR Jayanti: తెలుగు జాతికి వెలుగులు నింపిన రూపం అన్న ఎన్టీఆర్.. నేడు సినీ రంగంతో పాటు, రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసిన ఎన్టీఆర్ జన్మదినోత్సవం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేళ.. ఎన్టీఆర్ నటించిన అత్యుత్తమ చిత్రాలలో కొన్నింటిని చూద్దాం..ఎన్టీఆర్ ని ప్రేమగా స్మరించుకుందాం..
Updated on: May 28, 2022 | 12:53 PM

నందమూరి తారక రామారావుని సీనియర్ ఎన్టీఆర్ అని కూడా పిలుస్తారు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు.. రాజకీయ నాయకుడు. నటుడు, నిర్మాత, దర్శకుడు .. తనదైన వ్యక్తిత్వంతో ప్రసిద్ధి చెందారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిగాంచారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ కెరీర్‌లో ఎన్టీఆర్ 200కి పైగా చిత్రాల్లో నటించారు. 'విశ్వ విఖ్యాత నట సార్వభౌమ'గా ప్రసిద్ధి చెందాడు. ఈరోజు మే 28న ఆయన జన్మదినోత్సవం సందర్భంగా.. సినిమాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించిన కొన్ని సినిమాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

‘మాయాబజార్’లో నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుని పాత్రలో నటించారు. 1957లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికీ మాయాబజార్ సినిమాలోని శ్రీకృష్ణుడు పాత్రను అభిమానులు గుర్తుంచుకుంటారు.ఎన్టీఆర్ కొన్ని కోట్లమంది హృదయాలను గెలుచుకున్నారు. కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికీ టాలీవుడ్ సినీ చరిత్రలో గొప్ప చిత్రంగా నిలిచింది.

టాలీవుడ్‌లో రాముడి అంటే ముందుగా గుర్తుకొచ్చే వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. 1963లో ఎన్టీఆర్ 'లవ కుశ'లో రాముడి పాత్రతో తెలుగువారి ఇంటి రాముడిగా మారారు. ప్రజలు ఎన్టీఆర్‌ని రాముడి పేరుతో పిలవడం ప్రారంభించారు. ఆయనను పూజించడం కూడా ప్రారంభించారు.

శంకర్ కమలాకర కామేశ్వరరావు పౌరాణిక సృష్టి 'నర్తనశాల'లో సీనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనా నైపుణ్యాలను చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. అర్జునుడు.. బృహన్నల పాత్రను పోషించారు. ఈ సినిమా రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. బృహన్నలాగా ఎన్టీఆర్ నటనకు అనేక ప్రశంసలు లభించాయి.

సీనియర్ ఎన్టీఆర్ హీరో మాత్రమే కాదు నెగెటివ్ పాత్రళ్లూ కూడా నటించి మెప్పించారు. 'భూకైలాస్'లో ఎన్టీఆర్ రాక్షస-రాజు రావణుని ఐకానిక్ పాత్రను పోషించారు. రావణుడి పాత్రలో నటించి మెప్పించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

1977లో విడుదలైన 'దాన వీర శూర కర్ణ' సినిమాలో నందమూరి తారక రామారావు మూడు పాత్రల్లో నటించారు. కర్ణుడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు మూడు భిన్న పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు. తనను తాను మూడు విభిన్న పాత్రలుగా మార్చుకున్న విధానం నేటికీ ప్రశంసనీయం




