వీధుల్లో చేపల వర్షం! బకెట్లు,హెల్మెట్లతో పట్టుకుపోయిన జనం..! భలే వైరల్ వీడియో..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల సాయంతో ప్రపంచం మొత్తం మనిషి చేతుల్లోనే ఉంది. విచ్చలవిడి ఇంటర్‌నెట్ వినియోగంతో ప్రతి క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో అరచేతిలో వాలిపోతుంది. కొన్ని సందర్భాల్లో అరుదైన, అందమైన సంఘటనలు
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల సాయంతో ప్రపంచం మొత్తం మనిషి చేతుల్లోనే ఉంది. విచ్చలవిడి ఇంటర్‌నెట్ వినియోగంతో ప్రతి క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో అరచేతిలో వాలిపోతుంది. కొన్ని సందర్భాల్లో అరుదైన, అందమైన సంఘటనలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ తర్వాత నెటిజన్ల చేతుల్లో పడి వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా మరో అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ వింత దృశ్యం కనిపించింది. బతికి ఉన్న చేపలు రోడ్డుపై దూకడం చూసి అక్కడి జనాలు ఎగబడ్డారు. కుప్పలు తెప్పలుగా పడివున్న చేపల్ని అక్కడి స్థానికులు బుట్టలు, బక్కెట్లతో ఎత్తుకుపోతున్నారు. వీడియో చూస్తుంటే భలే ముచ్చగా అనిపిస్తోంది. అయినా, ఇంత ఎండకాలంలో అంతలా చేపలేలా రోడ్లమీదకు వచ్చాయనే సందేహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏదైనా చేపల చెరువు కట్ట తెగిపోయిందేమోననే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, అసలు సంగతి ఎంటంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో బీహార్‌కు చెందినదిగా తెలిసింది. బీహార్‌లోని గయా జిల్లా అమాస్ థానా ప్రాంతంలో గత శనివారం చేపలను తీసుకెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బొల్తాపడింది. దాంతో ట్రక్కు డోర్ లాక్ తెరుచుకుని ఒక్కసారిగా చేపలు రోడ్డుమీదకు కొట్టుకువచ్చాయి. ఆ ప్రాంతమంతా ఎటు చూసినా చేపలే చేపలు దర్శనమిచ్చాయి. దాంతో ప్రజలు చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. సమాచారం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించటంతో చేతికి దొరికిన వస్తువు తీసుకుని చేపల వేటకు బయల్దేరారు. బైకులు, ఆటోలు వాహనాల్లో వచ్చి చేపల్ని ఎత్తుకున్నారు. కొంతమంది ఆఖరుకు తలకు పెట్టుకునిహెల్మెట్‌తో కూడా చేపలు పట్టడం వీడియోలో కనిపించింది. ఈ మొత్తం సంఘటనను రికార్డ్ చేసి స్థానికులు కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో తుఫాను వేగంతో వైరల్‌గా మారింది.
सड़क पर गिरी मछली, मच गई लूट#बिहार pic.twitter.com/ZleUZpDOp2
— Hari krishan (@ihari_krishan) May 28, 2022
హరి కిషన్ అనే వ్యక్తి ఈ మొత్తం వీడియోను ట్విట్టర్ ద్వారా తెరపైకి తెచ్చాడు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఫన్నీ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అలాగే వీడియోపై కామెంట్లు, లైక్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.