AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై సింగర్‌ దారుణ హత్య..ఎవరినీ విడిచిపెట్టేది లేదన్న సీఎం, వెలుగులోకి కీలక అంశాలు..

జవహర్ కే గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో సిద్ధూపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. అతనిపై కనీసం 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు తెలిసింది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో అతడు మరణించినట్లు ప్రకటించారు.

నడిరోడ్డుపై సింగర్‌ దారుణ హత్య..ఎవరినీ విడిచిపెట్టేది లేదన్న సీఎం, వెలుగులోకి కీలక అంశాలు..
Punjabi Singer
Jyothi Gadda
|

Updated on: May 30, 2022 | 8:54 AM

Share

పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ మూసేవాల దారుణ హత్యకు గురయ్యాడు. మే 29న గుర్తు తెలియని దుండగులు సిద్ధూను కాల్చి చంపారు. జవహర్ కే గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో సిద్ధూపై కాల్పులకు తెగబడ్డారు దుండగులు. అతనిపై కనీసం 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్టు తెలిసింది. మాన్సాలోని సివిల్ ఆసుపత్రిలో అతడు మరణించినట్లు ప్రకటించారు. కాల్పుల ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. పంజాబ్‌ పోలీసులు ఆ మూసేవాలాతో సహా 424 మంది భద్రతను ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.

తన ఇద్దరు స్నేహితులతో కలిసి జీపులో ప్రయాణిస్తుండగా గాయకుడిపై దాడి జరిగింది. హుటాహుటినా స్థానిక సివిల్‌ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సిద్ధూ మూసేవాలా మృతి చెందినట్లు సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ రంజీత్‌ రాయ్ నిర్దారించారు.. బుల్లెట్ గాయాలు తగిలిన మరో ఇద్దరు క్షతగాత్రులను సైతం మరో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మాన్సా) గోబిందర్ సింగ్ పిటిఐతో మాట్లాడుతూ, అతనిపై దాడి జరిగినప్పుడు గ్రామ జవహర్ కే వద్ద తన జీపులో ఉన్న మూసేవాలాపై అనేక బుల్లెట్లు తగిలాయిని చెప్పారు. ఈ దాడికి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ బాధ్యులమని, ఇది ముఠాల మధ్య జరిగిన పోటీగా అనిపిస్తోందని డైరెక్టర్‌ జనరల్‌ పోలీస్‌ పంజాబ్‌, వీకే భవ్రా తెలియజేశారు.

మూసేవాలా గత ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాన్సా నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో ఓడిపోయారు.కాగా, సిద్దూకి నలుగురు గన్‌మెన్లతో సెక్యూరిటీ ఉండేది. భద్రత కుదింపులో ఇద్దర్ని తొలగించారు. అయితే ఆ ఇద్దర్ని కూడా నిన్న తన వెంట తీసుకెళ్లలేదు సిద్దూ. పైగా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా వాడలేదు. ఇవన్నీ దుండగులకు కలిసివచ్చాయి. పథకం ప్రకారం సిద్దూ తార్ వాహనాన్ని ఫాలో అయి కాల్పులతో హతమార్చారు. సిద్ధూ మృతిపట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ట్విట్టర్‌లో తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సిద్ధూ హత్యలో ప్రమేయం ఉన్నవారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు.

పంజాబీ సింగర్‌ సిద్దూ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. సీఎం ఆదేశాలతో ఐజీ రేంజ్‌ అధికారితో స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. విదేశాల నుంచే హత్యకు స్కెచ్‌ వేసినట్టు పోలీసులు గుర్తించారు. మాన్సా జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు సిద్దూను వెంటాడి వేటాడి కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సిద్దూపై 30 రౌండ్లకుపైగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హత్య చేసింది తానేనని ప్రకటించాడు కెనడా గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌. మరోవైపు ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ కూడా సంతాపం వ్యక్తం చేయగా, పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమ్రీందర్ సింగ్ అన్నారు.