BJP: కర్ణాటక నుంచి మరోసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. రాజ్యసభ సభ్యుల తొలి జాబితా విడుదల
వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికల కోసం బీజేపీ(BJP) అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మళ్లీ కర్ణాటక(Karnataka) నుంచి నామినేట్ చేసింది. మరో మంత్రి పీయూష్ గోయల్‌కూ...
వచ్చే నెల 10న జరిగే రాజ్యసభ(Rajya Sabha) ఎన్నికల కోసం బీజేపీ(BJP) అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను మళ్లీ కర్ణాటక(Karnataka) నుంచి నామినేట్ చేసింది. మరో మంత్రి పీయూష్ గోయల్‌కూ మళ్లీ మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించింది. 16 మంది అభ్యర్థుల పేర్లు కలిగిన తొలి జాబితాను పార్టీ ప్రకటించింది. సోమవారం ఉదయం మరో 10 లేదా 12 మందితో రెండో జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి కవిత పటిధార్, కర్ణాటక నుంచి జగ్గీష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ సుఖ్‌దేవ్ రావు, రాజస్థాన్ నుంచి ఘనశ్యామ్ తివారీ, ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మీకాంత్, రాధామోహన్, సురేంద్ర, బాబూరామ్, దర్శన, సంగీత యాదవ్, ఉత్తరాఖండ్ నుంచి సతీశ్ చంద్ర, శంబూ శరణ్, కల్పనా సైనీ, హర్యానా నుంచి క్రిషన్ లాల్, బిహార్ నుంచి సతీష్ చంద్ర దూబే, శంభు శరణ్ పటేల్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.
15 రాష్ట్రాల సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. 57 రాజ్యసభ సీట్లలో బీజేపీకి 23 సీట్లు దక్కనున్నాయి. వాటిలో 16 సీట్లకు అభ్యర్థులను ఆదివారం ప్రకటించగా మిగతా ఏడు సీట్లకు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో పదకొండు సీట్లు ఖాళీ కానుండగా, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఆరుగురు సభ్యుల చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. ఐదుగురు రాజ్యసభ ఎంపీలు బీహార్‌లో పదవీ విరమణ చేయనుండగా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి నలుగురు సభ్యులు బయటకు రానున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నేతలు రాజ్యసభ సీటు వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి