Sri Lanka: రోజురోజుకు తీవ్రమవుతున్న నిరసనలు.. 50 వ రోజుకు చేరిన ఆందోళనలు
శ్రీలంకలో(Sri Lanka) నిరసనలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సింహళ దేశంలో ప్రజలు చేస్తున్న ఆందోళనలు 50 వ రోజుకు చేరాయి. అయినప్పటికీ ఆందోళనలు ఆపేది లేదని, నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని...
శ్రీలంకలో(Sri Lanka) నిరసనలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సింహళ దేశంలో ప్రజలు చేస్తున్న ఆందోళనలు 50 వ రోజుకు చేరాయి. అయినప్పటికీ ఆందోళనలు ఆపేది లేదని, నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని నిరసనకారులు చెబుతున్నారు. దివాళా దిశగా పయనిస్తున్న శ్రీలంకలో అన్ని వస్తువుల్లో కొరత ఏర్పడింది. ఆహారం, ఇంధనం, ఔషధాలు, వంటగ్యాస్ చివరికి టాయిలెట్ పేపర్, అగ్గిపుల్లలకు సైతం కొరత ఏర్పడింది. ఫలితంగా నిత్యావసరాల కోసం ప్రజలు లైన్లలో బారులు తీరుతున్నారు. ఈ ఆర్థిక సంక్షోభం రాజకీయ అశాంతికీ దారి తీసింది. అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే గొటబాయ సోదరుడు మహింద రాజపక్స(Mahinda Rajapaksa) ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు కూడా పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన స్పందించం లేదు.
ఏప్రిల్ 9న కొలంబోలోని దేశాధ్యక్షుడి కార్యాలయం ప్రవేశ ద్వారాన్ని నిరసనకారులు దిగ్బంధించారు. నిరసనలను తీవ్రం చేశారు. పలుచోట్ల రాజకీయ నాయకులపై దాడులు కూడా జరిగాయి. 10 మంది ప్రాణాలు కోల్పోగా, కర్ఫ్యూ కూడా విధించాల్సి వచ్చింది.ఈ క్రమంలో శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. దేశంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీని(Emergency in Sri Lanka) ఎత్తివేస్తున్నట్లు అధ్యక్ష సచివాలయం ప్రకటన విడుదల చేసింది. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పోలీసులు, భద్రత దళాలకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి వారికి అధికారం ఉంటుంది.
మరోవైపు.. శ్రీలంకలో ఈ సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కారణమంటూ తన పదవి నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అధ్యక్షుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాయి. నిరసనకారుల ఆందోళనతో ఆదేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి