AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amalapuram: అమలాపురం అల్లర్లకు ముందే ప్లాన్.. వాట్సాప్ మెసేజ్ లతో విధ్వంసకాండ

అమలాపురం(Amalapuram) అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరినీ విచారించి కీలక విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. అల్లర్లకు ముందే ప్లాన్...

Amalapuram: అమలాపురం అల్లర్లకు ముందే ప్లాన్.. వాట్సాప్ మెసేజ్ లతో విధ్వంసకాండ
Amalapuram Incident
Ganesh Mudavath
|

Updated on: May 29, 2022 | 3:04 PM

Share

అమలాపురం(Amalapuram) అల్లర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరినీ విచారించి కీలక విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. అల్లర్లకు ముందే ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం వాట్సాప్ ను వేదికగా మార్చుకున్నారని గుర్తించారు. వాట్సాప్(Whatsapp) మెసేజ్ లు ఈ నెల 24న వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమవడం పోలీసులకు షాక్ కలిగించింది. ఈ ఘటనలో మరో 25 మందిని అరెస్టు చేశారు. 144 సెక్షన్‌ను మరో 5 రోజులు, 30 పోలీసు యాక్టును నెల రోజులు పొడిగిస్తున్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం అరెస్టు చేసిన 25 మందిలో 18 మంది వైకాపా కార్యకర్తలే ఉండటం గమనార్హం. విధ్వంసానికి పాల్పడినవారిని గుర్తించి, అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు ఇంకా పునరుద్ధరించలేదు. పాలిసెట్‌ అభ్యర్థుల కోసం సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం అమలాపురం అంతటా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి పినిపె విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు. అంతేకాకుండా కొంతమంది రోడ్లపైకి వచ్చి రాళ్ల దాడికి దిగటంతో.. పోలీసులు పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు ఒకదశలో గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ఇక ఈ అల్లర్లలో జిల్లా ఎస్పీ, డీఎస్పీతో పాటు ఏకంగా 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?