Vizag: సంతకు ఉడుమును తీసుకొచ్చిన వ్యక్తి.. కొనేందుకు ఎగబడ్డ జనం.. ఎంతకమ్మాడో తెల్సా..?

ఉడుము గురించి సిటీల్లో ఉండే వాళ్లకి తెలియకపోయినా.. పల్లె జనాలకు మాత్రం బాగా తెలుసు. ఇది చూడటానికి కాస్త భయానకంగా ఉంటుంది. దాని నాలుక చాలా పొడవు ఉంటుంది.

Vizag: సంతకు ఉడుమును తీసుకొచ్చిన వ్యక్తి.. కొనేందుకు ఎగబడ్డ జనం.. ఎంతకమ్మాడో తెల్సా..?
Udumu
Follow us
Ram Naramaneni

|

Updated on: May 29, 2022 | 4:23 PM

AP News: విశాఖ జిల్లా  భీమునిపట్నం నియోజకవర్గం తగరపువలస(Tagarapuvalasa)లో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది. ఎక్కువగా అక్కడ గొర్రెలు, మేకల కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతాయి. తాజాగా ఈ వారం ఒక ఉడుమును అమ్మకానికి పెట్టాడు ఓ వ్యక్తి.  1600 రూపాయలకు ఆ ఉడుము అమ్ముడయ్యింది. దానికి విపరీతంగా డిమాండ్ నడిచింది. కొనుగోలు చేసేందుకు జనాలు పోటీ పడ్డారు. నడుము నొప్పి, షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నవాళ్లు ఉడుము మాంసాన్ని వండుకుని తింటే.. ఆ పెయిన్స్ తగ్గి పోతాయని నమ్మకం. అందుకే దాన్ని కొనేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా ఉడుము చర్మం నుంచి తీసిన తైలం కూడా పక్షవాతం రోగులకి ఉపయోగపడుతుందని పల్లె జనాల్లో నమ్మకం ఉంది. చైనాలోనూ, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో శరీర దారుఢ్యానికి ఉడుము చమురును వాడుతుంటారు.  అయితే కొన్ని విషపూరితమైన ఉడుములు కూడా ఉంటాయి. అయితే ఉడుమును వేటాడితే చిక్కులు తప్పవని కొందరు అంటున్నారు. కుందేలు, జింక, నక్క, ఉడుము వంటి వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని, అది తెలిసి కూడా కొందరు వాటిని వేటాడుతున్నారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ