IPL-15: గుజరాత్ టైటాన్స్ కే విజయావకాశాలు ఎక్కువ.. డిక్లేర్ చేసిన చెన్నై మాజీ బ్యాట్స్ మెన్

ఇవాళ జరిగే ఐపీఎల్-15 వ సీజన్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. కొత్త జట్టుకే అధిక సానుకూల అంశాలున్నాయని అన్నాడు. ప్లే ఆఫ్స్ లో ఉన్న అన్ని జట్ల కంటే ముందే ఆ జట్టు....

IPL-15: గుజరాత్ టైటాన్స్ కే విజయావకాశాలు ఎక్కువ.. డిక్లేర్ చేసిన చెన్నై మాజీ బ్యాట్స్ మెన్
Raina
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 29, 2022 | 5:52 PM

ఇవాళ జరిగే ఐపీఎల్-15 వ సీజన్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుందని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. కొత్త జట్టుకే అధిక సానుకూల అంశాలున్నాయని అన్నాడు. ప్లే ఆఫ్స్ లో ఉన్న అన్ని జట్ల కంటే ముందే ఆ జట్టు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో వారికి నాలుగు, ఐదు రోజులు తగిన విశ్రాంతి దొరికిందని చెప్పాడు. దీంతోపాటు వరస విజయాలు సాధించడం కూడా మరో కారణమని అన్నాడు. అయితే పద్నాలుగేళ్ల తర్వాత ఫైనల్ కు చేరిన రాజస్థాన్‌ రాయల్స్ ను తక్కువ అంచనా వేయలేమని పేర్కొన్నాడు. ఆ జట్టు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉందన్న రైనా.. ఓపెనర్‌ జోస్‌బట్లర్‌ చివరి మ్యాచ్‌లోనూ చెలరేగితే రాజస్థాన్‌కు బాగా కలిసివస్తుందని జోస్యం చెప్పాడు. ఫలితంగా ఆఖరి పోరు ఆసక్తికరంగా మారుతుందని అన్నాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ చాలా అద్భుతంగా ఉందని తెలిపాడు.

ఈ రోజు (మే 29, ఆదివారం) IPL 2022 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 8 గంటలకి మ్యాచ్‌ ప్రారంభంకానుంది. నిజానికి 14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కి వచ్చింది. అయితే ఇక్కడ గుజరాత్‌ టైటాన్స్‌ కప్‌ గెలిస్తే హ్యట్రిక్‌ విజయం సాధించినట్లవుతుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌, రాజస్థాన్‌ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో గుజరాత్‌ విజయకేతనం ఎగరేసింది. ఇప్పుడు ఈ ఫైనల్‌లో గెలిస్తే హ్యాట్రిక్‌ విజయం సాధించినట్లవుతుంది.

ఐపీఎల్ 2022 ద్వారా గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. మొదటి నుంచి ఫైనల్‌ వరకు వరుస విజయాలు గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు బలమైన జట్టుగా ఎదిగింది. ఈ పరిస్థితిలో రాజస్థాన్‌.. గుజరాత్ వరుస విజయాలకి అడ్డుకట్ట వేస్తుందా.. కప్‌ గెలుస్తుందా అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడలు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి