AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-15: “రాజస్థాన్ గెలిస్తే బాగుంటుంది.. కానీ గుజరాతే గెలుస్తుంది”.. షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్

ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో..

IPL-15: రాజస్థాన్ గెలిస్తే బాగుంటుంది.. కానీ గుజరాతే గెలుస్తుంది.. షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్
Shoaib Aktar
Ganesh Mudavath
|

Updated on: May 29, 2022 | 7:19 PM

Share

ఐపీల్-15(IPL-15) సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించి క్రికెట్ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కు నివాళి అర్పించాలని కోరారు. అయితే అదే సమయంలో.. గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. ఐపీల్ టోర్నీ ప్రారంభమైన 2008 లో రాజస్థాన్‌ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ జట్టు ఫైనల్‌కు చేరింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ‘14 ఏళ్ల తర్వాత రాజస్థాన్‌ ఫైనల్‌ చేరింది. షేన్ వార్న్‌కు నివాళిగా ఆ జట్టు గెలవాలని బలంగా కోరుకుంటున్నా. ఇప్పటికే ఆ జట్టు ఎన్నో కష్టాలకోర్చి ఫైనల్ వరకు చేరింది. అయితే గుజరాత్‌ కూడా బాగా ఆడుతోంది.’ అని అక్తర్‌ అన్నారు. రాజస్థాన్‌ తొలి సీజన్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఫైనల్‌ చేరడంతో దూకుడుగా ఆడుతోందని, మరోవైపు.. గుజరాత్‌ కూడా తొలి సీజన్‌లో తమ మార్క్‌ చూపించాలని తాపత్రయపడుతోందని అక్తర్ వ్యాఖ్యానించారు.

ఐపీఎల్‌-2008లో రాజస్థాన్ రాయల్స్‌కు షేన్ వార్న్ సారథ్యం వహించారు. అరంగేట్రంలోనే జట్టుకు టైటిల్‌ అందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఆ తర్వాత రాజస్థాన్‌ మళ్లీ ఫైనల్‌ చేరుకోవడానికి పద్నాలుగేళ్లు పట్టింది. ఐపీఎల్‌-2022 తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ లో ఉన్న జట్ల కంటే ముందే ఫైనల్‌కు చేరింది.

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మొదలు కానుంది. ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ మొతేరా స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరగనున్న ఫైనల్ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలడుతుండగా.. ఈ రెండింటిలో ఈసారి టైటిల్ కొట్టేదెవరు? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడలు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా