GT vs RR, IPL 2022 Final Highlights: ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్.. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం..

| Edited By: Venkata Chari

Updated on: May 30, 2022 | 12:14 AM

Gujarat Titans vs Rajasthan Royals, IPL 2022 Final Highlights in Telugu: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

GT vs RR, IPL 2022 Final Highlights: ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్.. ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం..
Gujarat Titans Vs Rajasthan Royals Final

GT vs RR IPL 2022 Highlights: ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా హీరోగా నిరూపించుకున్నాడు. మూడు వికెట్లతో పాటు 34 పరుగులు కూడా చేశాడు. హార్దిక్ ఐదోసారి ఐపీఎల్ ఫైనల్ ఆడేందుకు వెళ్లి ప్రతిసారీ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతకుముందు, అతను నాలుగు సార్లు ఆటగాడిగా, ముంబై ఛాంపియన్ జట్టులో భాగంగా ఉన్నాడు.

రెండు జట్ల XI ప్లేయింగ్-

రాజస్థాన్ రాయల్స్ – యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & కీపర్), దేవదత్ పెడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ – వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్. సాయి కిషోర్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ.

Key Events

తొలి సీజన్‌లోనే గుజరాత్ అద్భుతం..

గుజరాత్ టైటాన్స్‌కి ఇది తొలి ఐపీఎల్ కాగా, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ఈ జట్టు ఫైనల్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫైనల్‌ మ్యా్చ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే.. ఆ టీమ్‌కు రేంజ్ ఎక్కడికో వెళ్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన రాజస్థాన్‌..

రాజస్థాన్ 2008లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. మళ్లీ 14 సంవత్సరాల తరువాత ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 May 2022 11:47 PM (IST)

    చరిత్ర సృష్టించిన గుజరాత్..

    ఐపీఎల్‌ తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది.

  • 29 May 2022 11:27 PM (IST)

    16 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. గిల్ 37, మిల్లర్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. గుజరాత్ విజయం సాధించాలంటే ఇంకా 24 బంతుల్లో 22 పరుగులు సాధించాల్సి ఉంది.

  • 29 May 2022 11:15 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    హార్దిక్ పాండ్యా (34) రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 13.2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 31 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 29 May 2022 11:09 PM (IST)

    12 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    12 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. గిల్ 29, హార్దిక్ 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 May 2022 10:53 PM (IST)

    9 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. గిల్ 19, హార్దిక్ 9 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 May 2022 10:42 PM (IST)

    6 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. గిల్ 10, హార్దిక్ 1 పరుగుతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 May 2022 10:35 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    వేడ్ (8) రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 5 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం రెండు వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 5, పాండ్యా 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 May 2022 10:25 PM (IST)

    3 ఓవర్లకు గుజరాత్ స్కోర్..

    3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. వేడ్ 2, గిల్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 May 2022 10:19 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..

    సాహా (5)రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ప్రసిద్ధ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం తొలి వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. క్రీజులో గిల్ 4, వేడ్ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 29 May 2022 10:07 PM (IST)

    గుజరాత్ టైటాన్స్ టార్గెట్‌ 131..

    20 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 9 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 131 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

  • 29 May 2022 09:52 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: మెక్‌కాయ్ ఔట్..

    Gujarat vs Rajasthan LIVE: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. మెక్‌కాయ్ రన్ ఔట్ అయ్యాడు.

  • 29 May 2022 09:47 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: బోల్ట్ అవుట్

    Gujarat vs Rajasthan LIVE: 18వ ఓవర్ మూడో బంతికి బోల్ట్ అవుటయ్యాడు. బోల్ట్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా.. రాహుల్ తెవాటియా లాంగ్ ఆఫ్ వద్ద క్యాచ్ పట్టాడు.

  • 29 May 2022 09:36 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్ స్కోర్ 17 ఓవర్లకు 102..

    Gujarat vs Rajasthan LIVE: 17 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ 102 పరుగులు చేసింది.

  • 29 May 2022 09:34 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: హెట్మెయర్ ఔట్..

    Gujarat vs Rajasthan LIVE: ఫైనల్ పోరులో రాజస్థాన్ రాయల్స్ చతికిల పడిపోతోంది. వరుసగా వికెట్లు సమర్పించుకుంటోంది. తాజాగా హట్మెయర్ అవుట్ అయ్యాడు. 15వ ఓవర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఈ బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు హెట్మేయర్ ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌ అంచుకు తగిలి పాండ్యా చేతిలోకి వెళ్లింది. దాంతో హెట్మేయర్ పెవిలియన్ బాట పట్టాడు.

  • 29 May 2022 09:09 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్‌కు భారీ దెబ్బ.. జోస్ బట్లర్ ఔట్..

    రాజస్థాన్‌కు వరుస షాక్ ‌లు ఇస్తున్నారు గుజరాత్ టైటాన్ బౌలర్స్. తాజాగా మరో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. జోస్ బట్లర్ ఔట్ అయ్యాడు.

  • 29 May 2022 09:05 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: దేవ్‌దత్ పడిక్కల్ ఔట్..

    గుజరాత్ బౌలర్లు మాంచి జోష్ లో ఉన్నారు. రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్ స్కోర్ చేయకుండా కట్టడి చేస్తూనే.. వికెట్లు పడగొడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ మరో వికెట్ కోల్పోయింది. దేవ్‌‌దత్ పడిక్కల్ చాలా ఈజీగా క్యాచ్ ఔట్ అయ్యాడు. 10 బంతులాడిన పడిక్కల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు.

  • 29 May 2022 08:47 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. స్కోర్ ఎంతంటే..

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఇప్పటి వరకు రెండు వికెట్లు కోల్పోయి. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఔట్ అయ్యారు. 9 ఓవర్లకు జట్టు స్కోర్ 60/2 ఉంది.

  • 29 May 2022 08:44 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: సంజూ శాంసన్ ఔట్..

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్‌ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ సంజు శాంసన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో సాయి కిశోర్ క్యాచ్ పట్టాడు. 11 బంతులాడిన శాంసన్.. 2 ఫోర్లతో 14 పరుగులు చేశాడు.

  • 29 May 2022 08:35 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్ స్కోర్ 6 ఓవర్లకు 53..

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మాంచి స్పీడ్ మీదున్నారు. యశస్వి వికెట్ తరువాత బట్లర్, సంజు శాంసన్ చాలా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ పెంచుతున్నారు. 7 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 53/1.

  • 29 May 2022 08:23 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: యశస్వి జైస్వాల్ ఔట్..

    Gujarat vs Rajasthan LIVE: మాంచి దూకుడు మీదున్న యశస్వి జైస్వాల్‌కు సాయి కిశోర్ రూపంలో షాక్ తగిలింది. యాష్ దయాల్ బౌలింగ్‌లో తొలుత సిక్స్ కొట్టిన జైస్వాల్.. తరువాతి బాల్‌కు క్యాచ్ ఔట్ అయ్యాడు. 16 బంతులాడిన జైస్వాల్ 2 సిక్సులు, 1 ఫోర్‌తో 22 పరుగులు చేశాడు. ప్రస్తుత రాజస్థాన్ స్కోర్ నాలుగు ఓవర్లకు 31/1.

  • 29 May 2022 08:20 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: మరో సిక్స్ కొట్టి. యశస్వి జైస్వాల్..

    Gujarat vs Rajasthan LIVE: యశస్వి జైస్వాల్ మాంచి స్పీడ్ మీదున్నాడు. తాజాగా మరో సిక్స్ కొట్టాడు.

  • 29 May 2022 08:15 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: సిక్స్ కొట్టిన జైస్వాల్..

    Gujarat vs Rajasthan LIVE: యశస్వి జైస్వాల్ సిక్స్ కొట్టాడు. రాజస్థాన్ స్కోర్ 3 ఓవర్లకు 21. క్రీజ్‌లో జైస్వాల్, బట్లర్ ఉన్నారు.

  • 29 May 2022 08:05 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్..

    Gujarat vs Rajasthan LIVE: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ బ్యాటింగ్‌కు వచ్చింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ క్రీజ్‌లోకి వచ్చారు.

  • 29 May 2022 07:54 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: ఇరు జట్ల ఫైనల్ టీమ్ మెంబర్స్ వీరే..

  • 29 May 2022 07:49 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: పిచ్ రిపోర్ట్

    నరేంద్ర మోదీ స్టేడియంలోని క్రికెట్ గ్రౌండ్‌లో పచ్చిక బయలు చాలా తక్కువగా ఉంది. ఇది ఫాస్ట్ బౌలింగ్‌కు ఉపకరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది అధిక స్కోర్ నమోదు చేయడానికి ఆస్కారం లభిస్తుందని, 180 పరుగుల కంటే ఎక్కువ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

  • 29 May 2022 07:44 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: తగ్గేదే లే అంటున్న రాజస్థాన్ రాయల్స్..

  • 29 May 2022 07:40 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: రాజస్థాన్ రాయల్స్ టీమ్ మెంబర్స్ వీరే..

    Rajasthan Royals (Playing XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్.

  • 29 May 2022 07:40 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: గుజరాత్ టైటాన్స్ టీమ్ మెంబర్స్ వీరే..

    Gujarat Titans (Playing XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ.

  • 29 May 2022 07:36 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్..

    Gujarat vs Rajasthan LIVE: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

  • 29 May 2022 07:31 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: అటు రెహమాన్, ఇటు రణవీర్.. స్టేడియం అంతా రచ్చ రచ్చే..

    Gujarat vs Rajasthan LIVE: నరేంద్ర మోదీ స్టేడియం ఆటలు, పాటలతో హోరెత్తిపోతోంది. మ్యూజిక్ మెజీషియన్ ఏఆర్ రెహమాన్‌కు.. బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ తోడవడం.. వేడుకలను మరింత క్రేజ్ వచ్చింది.

  • 29 May 2022 07:29 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: అదిరిపోయే ఫర్ఫార్మెన్స్‌తో దుమ్మురేపుతున్న రెహమాన్..

    Gujarat vs Rajasthan LIVE: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆటలు, పాటలతో స్టేడియం హోరెత్తుతోంది. ఏఆర్ రెహమాన్ తన పాటలతో మైమరిపిస్తున్నారు.

  • 29 May 2022 07:26 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: 75 ఏళ్ల ఇండియన్ క్రికెట్‌ హిస్టరీకి గుర్తుగా..

    Gujarat vs Rajasthan LIVE: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో ఐపీఎల్ 2022 ఫైనల్‌లో 75 ఏళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టీరికి గౌరవ సూచకంగా ప్రత్యేక వీడియోను రూపొందించింది ఐపీఎల్. ఈ వీడియోలో 75 ఏళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ప్రముఖుల క్రికెటర్ల పాత్రను కొనియాడుతూ ప్రశంసలు కురిపించింది.

  • 29 May 2022 07:14 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన అతిపెద్ద జెర్సీ..

    Gujarat vs Rajasthan LIVE: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌కు వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో.. అతిపెద్ద క్రికెట్ జెర్సీని ఆవిష్కరించారు నిర్వాహకులు. ఈ జెర్సీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకోగా.. ఇందుకు సంబంధించిన ధృవపత్రాన్ని సంబంధిత ప్రతినిధులు.. బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జయ్ షా, ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్‌ అందజేశారు.

  • 29 May 2022 07:03 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: మెస్మరైజింగ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్న ఏఆర్ రెహమాన్

    Gujarat vs Rajasthan LIVE: రణవీర్ సింగ్ ఫర్ఫార్మెన్స్ తరువాత ఏఆర్ రెహమాన్ వేదికపైకి వచ్చాడు. మెస్మరైజింగ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. మాంచి ఊపు తెప్పించే పాటలతో హోరెత్తిస్తున్నాడు.

  • 29 May 2022 07:01 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: స్టేడియంలోకి రణవీర్ సింగ్ ఎంట్రీ..

    బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ 2022 గ్రాండ్ ఫినాలే వేడుకల్లో తన ప్రదర్శన ఇచ్చాడు. రణవీర్ సింగ్ ఎంట్రీతో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలో హోరెత్తించారు.

  • 29 May 2022 06:59 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: ప్రేక్షకులతో కిక్కిరిపోయిన నరేంద్ర మోదీ స్టేడియం..

    గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలోనే.. నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. స్టేడియం మొత్తం ఫుల్అ యిపోయింది. కొద్దిసేపటి క్రితమే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

  • 29 May 2022 06:10 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: పోరుకు సై అంటున్న టైటాన్స్.. వీడియోపై ఓ లుక్కేసుకోండి..

  • 29 May 2022 05:47 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: విరాట్ రికార్డుపై బట్లర్ ఫోకస్..

    రాజస్థాన్ రాయల్స్.. ఫైనల్‌లో బట్లర్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ఇక బట్లర్ కూడా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడంపై దృష్టి పెట్టాడు. రెండో క్వాలిఫయర్‌లో RCBపై బట్లర్ ఈ సీజన్‌లో నాలుగో సెంచరీ సాధించాడు. మొత్తంగా 5 సెంచరీలు చేసి.. కోహ్లీతో సమానంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో మరో సెంచరీ చేస్తే.. కోహ్లీని బేట్ చేసిన బ్యాటర్‌గా బట్లర్ రికార్డులకెక్కుతాడు.

  • 29 May 2022 05:40 PM (IST)

    Gujarat vs Rajasthan LIVE: ఐపీఎల్ ముగింపు వేడుకలకు రణవీర్ సింగ్ రెడీ..

  • 29 May 2022 05:37 PM (IST)

    ఐపీఎల్ 2022 ఫ్రైజ్ మనీ.. గెలిస్తే ఎంత?.. ఓడితే ఎంత?..

    ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఇరు జట్లపై కనక వర్షం కురిపించనుంది. ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు అందుతాయి. రన్నరప్‌కు రూ. 13 కోట్లు లభిస్తాయి. మూడో ర్యాంక్‌లో ఉన్న ఆర్‌సీబీకి రూ. 7 కోట్లు, లక్నో నాలుగో ర్యాంక్ జట్టుకు రూ. 6.5 కోట్లు లభిస్తాయి.

  • 29 May 2022 05:35 PM (IST)

    ఐపీఎల్‌ 2022లో గుజరాత్ - రాజస్థాన్ ట్రాక్ ఇదీ..

    ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరోసారి ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ టైటిల్ పోరుకు ముందు ఇరు జట్లు రెండుసార్లు ఢీకొనగా, రెండు సందర్భాల్లోనూ గుజరాత్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య మూడో పోరు ఫైనల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని రాజస్థాన్ టీమ్ చాలా కసిగా ఉంది. మరోవైపు ఫైనల్‌లోనూ విజయం సాధించి రాజస్థాన్‌కు ఝలక్ ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ తపిస్తోంది.

  • 29 May 2022 05:33 PM (IST)

    ఐపీఎల్ ఫైనల్‌కు ‘ముఖ్య అతిథి’ ఎవరంటే..

    అహ్మదాబాద్‌లో జరుగనున్న ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తున్నట్లు సమాచారం ఉంది. అలాగే, ఐపీఎల్ ఫైనల్‌ను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో స్టేడియం భద్రతను పెంచారు.

  • 29 May 2022 05:31 PM (IST)

    ఫైనల్‌కు చేరడానికి రాజస్థాన్‌కు ప్రేరణ ఇదే..

    ఐపీఎల్ ఫైనల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేసింది. మోటివేషన్ పిక్‌గా దానిని పేర్కొంది. ఇంతకీ ఆ ఫోటో ఎంటంటే.. 2008లో రాజస్థాన్ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచినది.

  • 29 May 2022 05:27 PM (IST)

    8 గంటలకు మ్యాచ్ ప్రారంభం..

    ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7.30 గంటలకు టాస్ వేస్తారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో 7 గంటలకు టాస్‌ వేసి.. 7:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. కానీ, ఐపీఎల్ ఫైనల్ లో ముగింపు వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానుండగా, మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగనుంది.

  • 29 May 2022 05:23 PM (IST)

    బట్లర్‌ను ఇంటర్వ్యూ చేసిన సంజూ శాంసన్..

  • 29 May 2022 05:22 PM (IST)

    గుజరాత్ ప్రయాణం ఇలా సాగింది..

    ఐపీఎల్ 2022 ఫైనల్‌ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. లీగ్‌లో తొలిసారిగా ఎంటరైన గుజరాత్ టీమ్.. తన ప్రయాణాన్ని గుర్తు చేస్తూ ఒక టీచర్ విడుదల చేసింది.

  • 29 May 2022 05:20 PM (IST)

    జాస్ లైక్ ఏ బాస్.. లైక్ ఏ బీస్ట్..!

    IPL ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తన స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైక్ ది బాస్, లైక్ ది బీస్ట్ అంటూ క్యాప్షన్ పెట్టారు.. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బట్లర్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని బీస్ట్‌‌తో పోలుస్తూ అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు.

  • 29 May 2022 05:17 PM (IST)

    ఐపీఎల్ 2022 ఫైనల్‌ వేడుకలో 'లాల్ సింగ్ చద్దా' చిత్రం ట్రైలర్‌ను విడుదల..

    ఐపీఎల్ 2022 ఫైనల్ వేడుకలో క్రికెట్ లీగ్ చరిత్రలోనే తొలిసారిగా ఒక సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

  • 29 May 2022 04:50 PM (IST)

    ఫైనల్‌కు ముందు హార్దిక్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

  • 29 May 2022 03:16 PM (IST)

    అదిరిపోయేలా ఐపీఎల్ ఫైనల్ వేడుకలు.. బీసీసీఐ భారీ ప్లాన్స్..

    ఇక అదిరిపోయే రేంజ్‌లో ముగింపు వేడుకలకు బీసీసీఐ ప్లాన్ చేసింది. సాయంత్రం 6.15pm నుంచి ఈ వేడుక ప్రారంభమై నలభై నిమిషాల పాటు సాగుతుంది. 7pm గంటలకు క్లోజింగ్ సెర్మనీ ముగుస్తుంది. తర్వాత 7.30కు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వస్తారు. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ ముగింపు వేడుకలో ప్రత్యేకంగా భారతదేశ 75వ స్వాతంత్ర్య సంబరాలు జరుపుతారు. ఈ75ఏళ్లలో ఇండియాలో క్రికెట్ ప్రస్థానం ఎలా సాగిందో చూపించేలా భారీ స్క్రీన్లపై ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకాబోతున్నారు.

Published On - May 29,2022 3:15 PM

Follow us