GT vs RR: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఫేవరెట్ ప్లేయర్.. డేవిడ్ మిల్లర్ బౌలర్లకి కిల్లర్..!
GT vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఫైనల్లో ఈరోజు హార్దిక్ పాండ్యా అతడి ఫేవరెట్ బ్యాట్స్‌మెన్‌కి రంగంలోకి దించుతాడా.. అప్పుడే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే మిల్లర్
GT vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఫైనల్లో ఈరోజు హార్దిక్ పాండ్యా అతడి ఫేవరెట్ బ్యాట్స్‌మెన్‌కి రంగంలోకి దించుతాడా.. అప్పుడే టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే మిల్లర్ ఈ సీజన్‌లో 22 సిక్సర్లు కొట్టాడు. గుజరాత్ తరపున ఆడుతున్న మిల్లర్ బౌలర్లకు కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడి గణాంకాలు చూస్తే విషయం అర్థమైపోతుంది. డేవిడ్ మిల్లర్ ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 64.14 సగటుతో 141 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 449 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే గుజరాత్ తరపున చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2022లో ఫైనల్‌కు ముందు 29 ఫోర్లు, 22 సిక్సర్లు కొట్టాడు. ఇది మాత్రమే కాదు ఈ సీజన్‌లో నంబర్ 3 నుంచి బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్‌లలో మిల్లర్ రికార్డు, అతను చేసిన పరుగులే అత్యధికం.
ఈ గణాంకాలను చూస్తే రాజస్థాన్ రాయల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీనికి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్‌లో అతని ఆటతీరు. 2020 నుంచి స్పిన్‌కు వ్యతిరేకంగా 56.9 సగటుతో 136.9 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ప్రతి 7వ బంతికి బౌండరీలు కొట్టాడు. ఐపీఎల్ గురించి మాట్లాడితే.. స్పిన్నర్లు మిల్లర్‌కి ఫుల్ లెంగ్త్‌లో 28 బంతులు వేశారు. వాటిలో అతను 89 పరుగులు చేశాడు. దాదాపు 10 బంతులకి ఒక సిక్స్ కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 317.85. ఫాస్ట్‌బౌలర్లపై కూడా ఇదే రికార్డు ఉంది. ఈ గణాంకాలను చూసిన తర్వాత మిల్లర్‌ను ఆపడం రాజస్థాన్ ముందున్న పెద్ద సవాలు. షార్ట్ బౌలింగ్, గుడ్ లెంగ్త్ ఆఫ్ షార్ట్ బౌలింగ్ దీనికి పరిష్కారం. ఈ రెండు రకాల బంతుల్లో మిల్లర్ రికార్డు 127.7కి తగ్గింది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి